గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 18 జనవరి 2017 (15:32 IST)

పచ్చి బఠాణీలను చలికాలంలో తీసుకోండి.. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోండి

పచ్చి బఠాణీలను చలికాలం ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో వచ్చే క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బఠాణీలను పిల్లలు, పెద్దలు తీసుకుంటే అనారోగ్య సమస్

పచ్చి బఠాణీలను చలికాలం ఎక్కువగా తీసుకోవాలి. ఈ సీజన్లో వచ్చే క్యాలీఫ్లవర్, పచ్చి బఠాణీలను వంటల్లో చేర్చుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పచ్చి బఠాణీలను పిల్లలు, పెద్దలు తీసుకుంటే అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. బఠాణీల్లో బీటా సైటో స్టెరాల్‌ లభ్యమవుతుంది. ఈ రకమైన స్టెరాల్స్‌ శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. తాజా బఠాణీల్లో కె-విటమిన్‌ శాతం ఎక్కువగా ఉంటుంది. ఎముకల బరువు పెరగడానికి ఇది ఎంతో అవసరం.
 
ఆల్జీమర్స్‌, ఆర్థరైటిస్‌ వంటి వ్యాధుల నివారణకు బఠాణీలతో తయారు చేసిన ఆహారం ఎంతగానో తోడ్పడుతుంది. బఠాణీల్లో యాంటీ యాక్సిడెంట్లు ఫ్లేవనాయిడ్స్‌ జియాక్సాంథిన్‌, ల్యూటెన్‌, విటమిన్‌-ఎ వంటి కెరొటినాయిడ్లూ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఇవి కంటి ఆరోగ్యానికీ ఎంతో మంచివని వైద్యులు చెప్తున్నారు. 
 
వీటిని తీసుకోవడం ద్వారా యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేసుకోవచ్చు. ఇవి గర్భస్థ శిశువులోని నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుందని వారు సూచిస్తున్నారు. వేయించిన బఠాణీల కంటే ఆకుపచ్చ బఠాణీలే ఆరోగ్యానికి మేలు చేస్తాయని వారు చెప్తున్నారు.