గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2017 (13:37 IST)

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగాలా? గుప్పెడు వేరుశెనగలు తినండి..

వేరుశెనగల్లో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్‌, బోరాన్‌లలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు.. ప్రాణాంతక వ్యాధులను కూడా వేరుశెనగలు దూరం చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్

వేరుశెనగల్లో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్‌, బోరాన్‌లలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అంతేకాదు.. ప్రాణాంతక వ్యాధులను కూడా వేరుశెనగలు దూరం చేస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధులను దరి చేరనివ్వవు. వేరుశనగపప్పు లోని ఫైబర్‌, యాంటిఆక్సిడెంట్లు, ఫ్యాటీ యాసిడ్లు శరీర ఆరోగ్యానికి సహకరించడంతో ఆయుష్షును పెంచుతాయట. 
 
రోజూ గుప్పెడు వేరుశెనగలు తీసుకోవడం ద్వారా కేన్సర్‌ ముప్పు తొలగుతుంది. కొలెస్ట్రాల్‌ శాతం అదుపులో ఉంటుంది. బరువు తగ్గేందుకు, ఆర్థరైటిస్‌ నివారణకూ ఉపయోగపడుతుంది. ఇది పొట్టచుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించేందుకు తోడ్పడుతుంది. ఈ పప్పులోని ఇనుము రక్తహీనతను తగ్గిస్తుంది. శరీరంలో హీమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది. పప్పుతోపాటు వేరుశనగ నూనె కూడా మంచిదే.
 
వేరుశెనగలను రోజువారీ డైట్‌లో తీసుకోవడం ద్వారా విటమిన్‌-ఇ, పాలీఫెనాల్స్‌ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. పోషకాహార లోపం కారణంగా బలహీనంగా ఉండే పిల్లలకు వేరుశనగను మించి ఔషధం లేదు. అదే విధంగా గర్భిణులకు, బాలింతలకు మాంసకృత్తులు వీటినుంచి సమృద్ధిగా లభిస్తాయి. వేరుశనగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.