శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 4 జూన్ 2017 (16:31 IST)

రుతుక్రమ సమస్యలను దూరం చేసే జామకాయ

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంద

జామపండు ప్రతి రోజు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బాగామాగిన జామపండులోని 50 గ్రాముల గుజ్జు, పది గ్రాముల తేనెను కలిపి తీసుకుంటే శరీరంలో శక్తి పుంజుకుంటుంది. 
 
* గుండెజబ్బుతో బాధపడే వారు ప్రతి రోజు భోజనంతో పాటు జామపండు గుజ్జును మూడు నెలలపాటు తీసుకుంటే మంచి ఫలితముంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. జామపండును తింటే శరీరంలో రక్త సరఫరా సాఫీగా జరుగుతుంది.
 
* ఉదయం, రాత్రి వేళల్లో భోజనానంతరం జామపండు తీసుకుంటే.. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. దీంతోపాటు మానసిక ఒత్తిడి కూడా మటుమాయమవుతుంది. 
 
* జామపండు చెట్టులోని ఆకులు 25 మేర తీసుకుని నీటిలో ఉడకబెట్టండి. ఉడకబెట్టిన నీటిని చల్చార్చి అందులో పటిక వేసి బాగా కలుపుకోండి. ఆ నీటిని పుక్కలిస్తే పంటి నొప్పులు మటుమాయమై పోతాయి. స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, బ్రెస్ట్ క్యాన్సర్, పురుషులలో ప్రోస్టేట్ క్యాన్సర్లు రాకుండా నివారించే గుణం జామకాయలో పుష్కలంగా ఉంది.