జామకాయ గుజ్జు-బెల్లంతో చేసిన దోసెల్ని తీసుకుంటే?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (14:37 IST)

జామకాయను అంత సులభంగా తీసిపారేయకండి. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలున్నాయి. జామలో విటమిన్ సి, విటమిన్ బి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ధాతువులు పుష్కలంగా ఉండటంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పిల్లల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడే జామకాయను ఎముకలకు బలాన్నిస్తుంది. 
 
గింజలను తొలగించి.. జామ గుజ్జును మాత్రమే తీసుకుని, అందులో బెల్లాన్ని, దోసెపిండితో కలిపి దోసెలు తయారు చేసి పిల్లలకు ఇస్తే ఇష్టపడి తింటారు. రోజూ ఓ జామపండుతను తీసుకుంటే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. రోజు రెండు జామపండ్లను తింటే పిల్లలు సులభంగా ఎదుగుతారు. జామ పండును లేకా కాయను ముక్కలు చేసుకుని తినడం కంటే.. అలాగే తినడం ద్వారా దంత సమస్యలు దరిచేరవు. 
 
ఇంకా చర్మానికి జామకాయ ఎంతో మేలు చేస్తుంది. ముఖానికి తేజస్సుని ఇస్తుంది. చర్మం పొడిబారనీయకుండా చేస్తుంది. చర్మం, ముఖంపై ముడతలను తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయలను దూరం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు జామకాయ ఎంతో మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది. ఇంకా నియంత్రిస్తుంది. రోజూ ఓ జామకాయను తినడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. జీర్ణక్రియను మెరుగుపరుచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వారానికి నాలుగుసార్లు చేస్తే... వయస్సు పదేళ్లు తగ్గిపోతుంది...

తమ అసలు వయసు కంటే చిన్నవారిగా కనిపించాలనే ఆసక్తి ఎవరికి ఉండదు చెప్పండి? భారతదేశంలో ...

news

వేసవి ఎండల్లో బయటికి వెళ్లాల్సి వస్తే..?

వేసవిలో ఎండల్లో వెళ్లే పనులను చాలామటుకు పక్కనబెట్టండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ...

news

గాలిని పీల్చకండి... అలా తాగెయ్యండి.. ఊరిస్తున్న కొత్త టెక్నాలజీ

అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కి చెందిన భారత సంతతి ...

news

వేసవిలో కొబ్బరి బొండాం.. మజ్జిగ తాగితే జలుబు చేస్తుందా?

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా ...