శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 9 జనవరి 2016 (10:27 IST)

శరీరంలోని వేడిని తగ్గించే తేనె

తేనె సాధారణంగా మన అందరి ఇళ్ళల్లో ఉండే ఔషదమే. తేనెను సాధారణంగా ఆహార రుచుల కోసం మాత్రమేకాకుండా, చర్మ సమస్యలను తగ్గించటానికి కూడా వాడతారు. తేనెను ఎక్కువగా వాడడం వల్ల అనేక లాభాలున్నాయి. అనేక రకాల వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది. ఇలాంటి తేనె మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెల్సుకుందాం! 
 
అతి మూత్రవ్యాధి సమస్యతో బాధపడేవారు రాత్రి నిద్ర పోయే ముందు ఒక చెంచా తేనె తీసుకుంటే అప్పుడప్పుడు మూత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. రోజూ ఒక స్పూన్ తేనె తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది. ఒక స్పూన్ తేనె, కొంచెం నిమ్మకాయరసం, అరగ్లాసు నీటిలో కలిపి తీసుకుంటే వడదెబ్బ తగలదు.శరీరంలోని అధిక వేడిని తొలగిస్తుంది.
 
తేనె పుచ్చుకుంటే కళ్ళలో వేడి తగ్గి దృష్టి మెరుగుపడేలా చేస్తుంది. పంచదారకు బదులుగా తేనెను వాడటం వల్ల ఆరోగ్యదాయకంగా పనిచేస్తుంది. తేనె, నిమ్మరసం సమభాగాలుగా తీసుకుంటూ ఉంటే గొంతునొప్పి, గొంతు గరగర, గొంతు బొంగురుపోయినట్లుండటం వంటి బాధలు తగ్గుతాయి.
 
రెండు గ్లాసుల నీటిలో తేనె కలిపి తాగాలి. ఇది డయేరియా తగ్గడానికి సులభమైన మార్గం. చక్కెరతో పోల్చితే తేనెలో క్యాలరీలు తక్కువ. తేనెలో కొవ్వు శాతం కూడా చాలా తక్కువ కాబట్టి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అధిక బరువును తగ్గించడంలో తేనె అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక చెక్క నిమ్మరసం కలుపుకొని తాగితే స్థూలకాయాన్ని నివారించవచ్చు.