బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (12:43 IST)

వట్టి కాళ్లతో నడవటం మంచిదా? చెప్పులు వేసుకుని నడవటం మంచిదా?

చెప్పులు వేసుకుని నడవటం మంచిదా? చెప్పుల్లేకుండా వేసుకుని నడవటం మంచిదా? అని అడిగితే వట్టి పాదాలతో నడిస్తేనే కాళ్లకు గాయాలు కావని అంటున్నారు న్యూయార్క్‌లోని ఇథాకా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండ్ హ్యూమన్ పెర్ఫామెన్స్‌కు చెందిన ప్రొఫెసర్ పాట్రిక్ మెక్‌కెన.

ఆరుబయట చెప్పుల్లేకుండా హాయిగా తిరగడం ద్వారా కాళ్లలోని, పాదాల్లోని చిన్న, పెద్ద కండరాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. వీటి గురించి న్యూరల్ కనెక్షన్ ద్వారా బ్రెయిన్‌కి సమాచారం చేరుతుంది. ఇవి దెబ్బతింటే గాయాలు బాగా తగిలే అవకాశం ఉంది. 
 
అంతేకాకుండా షూస్ వేసుకోవడం ద్వారా పాదాల కండరాల మధ్య ఉండే సహజసిద్ధమైన లింకు దెబ్బతింటుందని పాట్రిక్ వెల్లడించారు. కండరాలు సరిగ్గా పనిచేయకపోతే లిగ్మెంట్స్ మీద.. ఎముకల మీద టెన్డెన్స్ మీద ప్రభావం పడి గాయాల రిస్క్ మరింత పెరుగుతుంది. అందుకే పాదాలు, కాళ్లు, కండరాలు దృఢంగా పనిచేయాలంటే చెప్పుల్లేకుండా నడవాలని.. తద్వారా కండరాలు బలపడతాయని పాట్రిక్ వెల్లడించారు.