శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (13:06 IST)

చిన్నారుల జ్ఞాపకశక్తిని పెంచుటకు కోడి గుడ్డు..?

పిల్లలు గలగల పారే సెలయేరుల్లా ఉంటారు. ఈ వయసులోనే వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. కనుక మెదడు ఆరోగ్యానికి మేలుచేసే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. పాలలో విటమిన్ ఎ, బి2, బి12, డి, జింక్, క్యాల్షియం, పాస

పిల్లలు గలగల పారే సెలయేరుల్లా ఉంటారు. ఈ వయసులోనే వారి మెదడు అభివృద్ధి చెందుతుంది. కనుక మెదడు ఆరోగ్యానికి మేలుచేసే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం. పాలలో విటమిన్ ఎ, బి2, బి12, డి, జింక్, క్యాల్షియం, పాస్పరస్, మినరల్స్ వంటి పదార్థాలు ఎముకలు, దంతాలు, గోళ్లు దృఢంగా మారుస్తాయి. కనుక ప్రతిరోజూ చిన్నారులకు పాలు తాగడం అలవాటు చేయాలి.
 
చిక్కుడుకాయలో యాంటీ ఆక్సిడెంట్స్, పీచు, క్యాల్షియం, ఇనుము, విటమిన్ బి, మాంసకృతులు వంటి మూలకాలు శరీరంలోని కొవ్వును కరిగించుటకు ఉపయోగపడుతాయి. అంతేకాకుండా శరీరానికి కావలసిన పోషక విలువలను అధిక మోతాదులో అందిస్తాయి. చీజ్ అనేది పాలతోనే తయారుచేస్తారు. కాబట్టి పిల్లలు ఇష్టంగా దీనిని తీసుకుంటారు. 
 
చీజ్‌లోని పాస్పరస్, విటమిన్ బి12, మాంసకృతులు చిన్నారులు అరగుదలకు సహాయపడుతాయి. గుడ్డులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, సెలీనియం, ప్రోటీన్స్, జింక్, విటమిన్ బి వంటి పోషక విలువలు పిల్లల పెరుగుదలకు చాలా దోహదపడుతాయి. కనుక ప్రతిరోజూ చిన్నారులకు గుడ్డును తినిపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.