మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (12:46 IST)

యవ్వనంగా ఉండాలా? సాల్మన్ ఫిష్ తీసుకోండి..!

యవ్వనంగా ఉండాలా.. సాల్మన్ ఫిష్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాల్మన్‌ చేపల్ని తరుచూ తింటే గుండెకు బలం చేకూరడమే కాకుండా, పలు సమస్యలనుంచి చర్మ రక్షించండుతుంది. ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌కు ఈ చేప

యవ్వనంగా ఉండాలా.. సాల్మన్ ఫిష్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాల్మన్‌ చేపల్ని తరుచూ తింటే గుండెకు బలం చేకూరడమే కాకుండా, పలు సమస్యలనుంచి చర్మ రక్షించండుతుంది. ఓమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్‌కు ఈ చేప ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని మృదువుగానే కాదు యవ్వనవంతంగా నిలబెడతాయి. పైగా చర్మం కందిపోవడం, పొడిబారిపోవడం, వాపు, దురద వంటి సమస్యలు రావు. ప్రత్యేకించి ఇందులో ఉండే యాస్టాక్స్‌రాథిన్‌ చర్మపు సాగే గుణాన్ని పెంచడంతో పాటు చర్మానికి యవ్వనపు కాంతిని నింపుతాయి.
 
టమోటాలు చర్మ సౌందర్యంలో వీటి పాత్ర చాలా కీలకం కావడానికి ఇందులో సమృద్ధిగా ఉండే లైకోపిన్‌ ఒక ప్రధాన కారణం. ఎండవేడికి చర్మం దెబ్బతినే పరిస్థితి నుంచి సమర్థవంతంగా కాపాడే శక్తి ఈ లైకోపిన్‌లో పుష్కలంగా ఉంది. టమోటోలో ఉండే కెరటాయిడ్స్‌ చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. ఇవి కణాల క్షయాన్ని అరికట్టడమే కాకుండా, వృద్ధాప్య వేగాన్ని బాగా తగ్గిస్తాయి. టమోటోలను రసంగానూ, సాస్‌గానూ, పేస్ట్‌గానూ వాడుకోవడం ద్వారా మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.
 
సిట్రస్ పండ్లు సమృద్ధిగా ఉండే సి -విటమిన్‌ చర్మానికి చక్కని ఆకర్షణను నింపుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గానే కాకుండా, చర్మంలో ఉండే ఆక్సిడేటివ్‌ సె్ట్రస్‌ను తగ్గిస్తాయి. ఇవి చర్మానికి ఒక దృఢత్వాన్ని ఇవ్వడం ద్వారా చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. వీటిలో చర్మంలో వాపు రాకుండా కాపాడతాయి.
 
ప్రతిరోజూ బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు ఉండేలా చూసుకోవాలి. గుడ్లలో ప్రొటీన్‌తో పాటు ఏ- విటమిన్‌, జింక్‌, సి- విటమిన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఈ గింజల్లో గుడ్డల్లో లాగే చర్మాన్ని పోషించే ప్రొటీన్‌ నిండుగా ఉంటుంది. దీనికి తోడు విటమిన్‌- ఇ, సెలేనియం ఉండటం వల్ల సూర్మరశ్మికి చర్మం దెబ్బ తినకుండా రక్షణ పొందుతుంది. ఇందులోని విటిమిన్‌- ఇ వల్ల చర్మం పొడి బారకుండా, కందిపోయి, వాపు రాకుండా కాపాడుతుంది.