శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 27 జులై 2016 (10:39 IST)

గుప్పెడు నువ్వులు = గ్లాసు పాలు: క్యాల్షియం ఎంతుందో తెలుసా?

నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయ. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. వారం రోజుల పాటు రెండు స్పూన్ల నువ్వుల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్

నువ్వుల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయ. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో బాగా పనిచేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. వారం రోజుల పాటు రెండు స్పూన్ల నువ్వుల్ని తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు అంటున్నారు. నువ్వులు మాత్రమే కాకుండా వాటి నుంచి తీసిన నూనె కూడా రక్తంలో కొవ్వులు పేరుకోకుండా చేయడం ద్వారా హృద్రోగాల్ని నియంత్రిస్తుంది. ఇంకా బీపీని తగ్గిస్తుంది.  
 
ఇంకా గుప్పెడు నువ్వులు ఒక గ్లాసు పాలుకు సమానమని.. గుప్పెడు నువ్వుల్లో ఒక గ్లాసు కంటే ఎక్కువ క్యాల్షియం లభిస్తుందని.. తద్వారా ఎముకల ఆరోగ్యం బాగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాలేయ పనితీరును మెరుగుపరిచే నువ్వులను తీసుకుంటే కీళ్ల నొప్పులు దరిచేరవు. అనీమియాతో బాధపడేవాళ్లకి నల్ల నువ్వుల్లోని ఐరన్ ఎంతో మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. 
 
నువ్వుల్లోని థైమీన్‌, ట్రిప్టోఫాన్‌ అనే విటమిన్లు సెరటోనిన్‌ను ఉత్పత్తిచేయడం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచి మంచి నిద్ర పట్టేలా చేస్తాయి. తద్వారా నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. ఇందులోని యాంటీయాక్సిడెంట్లు వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది.