గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (11:28 IST)

మొలకల్ని ఉడికించకండి.. వేయించకండి.. అలాగే తినండి.. లాభాలేంటో తెలుసుకోండి..

రోజూ గుప్పెడు మొలకలు తినండి.. జుట్టును పెంచుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెసలూ, బఠాణీలూ, సెనగ మొలకల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొలకల్లో విటమిన్‌ సి, కెలు అధికంగా లభిస్తాయి. విటమిన్ సి జుట్టు

రోజూ గుప్పెడు మొలకలు తినండి.. జుట్టును పెంచుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెసలూ, బఠాణీలూ, సెనగ మొలకల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ మొలకల్లో విటమిన్‌ సి, కెలు అధికంగా లభిస్తాయి. విటమిన్ సి జుట్టు పెరుగుదలకు బాగా ఉపకరిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే గుణం మొలకలకు ఉంది. గర్భిణీ మహిళలు ఇంట్లోనే మొలకెత్తించుకుని తీసుకోవడం మంచిది. 
 
పెసర మొలకల్ని సాధ్యమైనంత వరకూ ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలాగని అతిగా మాత్రం తీసుకోకూడదు. గ్యాస్‌ సమస్య ఎదురుకావొచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్లూ, బ్యాక్టీరియా దూరమవుతాయి. బఠాణీలను ఉదయం పూట తీసుకోవాలి. వ్యాయామానికి ముందు తీసుకుంటే ఎంతో శక్తి అందుతుంది. బఠాణీలను తినడం ద్వారా చెడు కొవ్వు నిల్వలు తగ్గిపోతాయి. అంతేకాదు బఠాణీ మొలకల్లో కొవ్వులూ, కొలొరీలూ చాలా తక్కువ. బరువు తగ్గాలనుకున్నవాళ్లు తీసుకున్నా ఇబ్బంది ఉండదు. వీటిలోని పోషకాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
 
ఇక శెనగల్లో మేలురకం కార్బోహైడ్రేట్లు ఎక్కువ. విటమిన్‌ బి6 పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకున్న వారికి సెనగ మొలకలు చక్కని ఆహారం. ఈ మొలకల్లో కొలెస్ట్రాల్‌ ఉండదు. చర్మ సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి.
 
మొలకలు వచ్చిన గింజలను అలాగే తినవచ్చు. లేదంటే ఇతర ఆహార పదార్థాల్లో కలుపుకుని తినవచ్చు. మొలకెత్తిన గింజల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు, టమాట, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర కలిపి చిటికెడు ఉప్పు కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఉడికించకుండా, వేయించకుండా తినడం వల్ల వాటిలోని పోషక పదార్థాలు పూర్తిస్థాయిలో శరీరానికి అందుతాయి.