శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2017 (14:37 IST)

వేపతో మేలు... ఎదురు తిరిగితే చంపేస్తుంది... రోగాల్ని కాదు... మనుషుల్ని... ఔనా?

వేపాకు అనగానే మనం ఎప్పుడూ అది చేసే మేలు గురించే చదువుతూ వుంటాం. కానీ వేపాకును కొన్ని సమయాల్లో ఉపయోగిస్తే అది మరణాన్ని కూడా కలిగిస్తుంది. అంతేకాదు... కొన్నిసార్లు పలు ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. ఇ

వేపాకు అనగానే మనం ఎప్పుడూ అది చేసే మేలు గురించే చదువుతూ వుంటాం. కానీ వేపాకును కొన్ని సమయాల్లో ఉపయోగిస్తే అది మరణాన్ని కూడా కలిగిస్తుంది. అంతేకాదు... కొన్నిసార్లు పలు ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతుంది. ఇంతకీ వేపాకు చేసే చెడు ఏమిటో చూద్దాం.
 
* చంటి పిల్లలను చంపేస్తుంది...
వేప నూనెను చంటిబిడ్డలకు ఉపయోగిస్తే దాని వాల్ల రియేస్ సిండ్రోమ్ తలెత్తి ప్రాణాలు పోయే ప్రమాదం వుంది. వేప నూనె ఆరోగ్యమే కదా అని చంటి పిల్లలకు ఇస్తే అది మరణాన్ని తెచ్చిపెడుతుంది. 
 
* అలెర్జీలు తీవ్రస్థాయిలో వుంటే...
పలు రకాల అలెర్జీలకు వేప బాగా పనిచేస్తుందనుకుని చాలామంది వేపాకులను బాగా నూరి పట్టిస్తుంటారు. కానీ అలెర్జీ తీవ్ర స్థాయికి వెళ్లినప్పుడు వేపాకును రాస్తే అది మరింత తీవ్రరూపం దాల్చి సమస్యను జఠిలం చేస్తుందంటున్నారు.
 
* సంతాన సాఫల్యతపై దెబ్బ
కొన్ని పంటలకు రైతులు వేప నూనెను వాడుతుంటారు. వరి పంటకు కూడా వాడుతుంటారు. ఈ వేప నూనెను వాడిన ధాన్యాన్ని తింటే సంతాన సాఫల్యతపై దెబ్బ తీస్తుందని నిపుణులు చెపుతున్నారు.
 
* అలా చేస్తే మహిళ గర్భవతి కాదు...
వేప స్త్రీ గర్భాశయంపైన కూడా ప్రభావం చూపుతుందట. గర్భాశయంలో ప్రవేశించిన వీర్య కణాలను కూడా నశింపజేసే శక్తి దీనికి వున్నదట. అందువల్ల మహిళ తన పొట్టపైన ఎట్టి పరిస్థితుల్లోనూ వేపాకును కానీ వేప నూనెను కానీ వుంచుకోరాదని చెపుతున్నారు.
 
* కాలేయం, కిడ్నీలు పాడవుతాయ్..
వేపలో సహజసిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్స్ వుండటం మూలంగా అది కిడ్నీలకు, ఇతర శరీర అంగాలకు మేలు చేస్తుందని అంటారు. కానీ వేపను మోతాదుకు మించి తీసుకుంటే అది రివర్స్ అవుతుంది. కిడ్నీలను పాడు చేయడమే కాకుండా కాలేయాన్ని కూడా డ్యామేజ్ చేస్తుంది. 
 
* కడుపులో గడబిడ
చాలామంది ఉదయం లేవగానే వేపాకును నూరి ముద్దగా చేసుకుని మింగేస్తే రోగాలు తగ్గిపోతాయనుకుంటారు. కానీ ఇది నిర్ణీత మోతాదులో సేవిస్తే మంచి ఫలితాన్నిస్తుంది. కానీ మోతాదుకి మించి తీసుకుంటే ముంచుతుంది. కడుపు గడబిడతో గందరగోళమవుతుంది.
 
* తక్కవ బ్లడ్ షుగర్... 
 
మధుమేహ రోగులకు బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేసేందుకు కొద్ది మోతాదులో వేప నూనెను తీసుకోమని వైద్యులు చెపుతుంటారు. ఐతే నిర్ణీత మోతాదుకు మించి వేప నూనెను తీసుకుంటే అది అపాయం చేస్తుంది. కొన్నిసార్లు మధుమేహ రోగులు కోమాలోకి కూడా వెళ్లిపోయే పరిస్థితులు వస్తాయి. అందువల్ల వేపాకును వాడేటపుడు అల్లాటప్పాగా వాడరాదు. వైద్యుల సూచనల మేరకే వాడుతుండాలి. 
 
* శరీరాంగ మార్పిడి చేసుకునేవారికి అపాయం..
శరీరాంగ మార్పిడి చికిత్స చేయించుకునేవారు వేపను వాడటం మంచిది కాదు. ఇది నాడీ వ్యవస్థపై పని చేసి అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. కాబట్టి వేప ఆకే కదా అని ఎలాబడితే అలా వాడితే సమస్యను తుడిచియేడం అటుంచి కొత్త సమస్యలను సృష్టిస్తుంది. జాగ్రత్తగా వుండాలి మరి.