శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 9 జనవరి 2016 (12:42 IST)

జామపండుని తినండి కొవ్వుని కరిగించుకోండి

ఈ సీజన్‌లో దొరికే అత్యంత పోషక విలువలు కలిగిన ఫలం జామకాయ. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడడంతోపాటు, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఫలాన్ని తినడం వల్ల కలిగే మరిన్ని లాభాల గురించి తెలుసుకుందాం.
 
నారింజలో కన్నాజామలో విటమిన్-సి నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అలాగే సాధారణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుతుంది. దీనిలో ఫైబర్‌ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మధుమేహంతో బాధపడుతున్న వారికి దోహదపడుతుంది. 
 
జామకాయలు తీసుకోవడం వల్ల శరీరానికి సోడియం, పొటాషియం పుష్కలంగా దొరుకుతుంది. రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది. జామలో ఫైబర్‌ ఉండడం వల్ల జీర్ణక్రియరేటు కూడా వృద్ధి అవుతుంది. ఇతర పండ్లతో పోలిస్తే జామకాయల్లో షుగర్‌ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల బరువు తగ్గేందుకు కూడా సహాయపడుతుంది. 
 
అలాగే శరీరంలోని అనవసరపు కొవ్వును కరిగించడానికి జామపండు ఉపయోగపడుతుంది. అలాగే జామకాయల్లో విటమిన్-ఎ ఉండడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాల వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. జామకాయ పండు గుజ్జు ముఖానికి స్ర్కబ్‌లా పనిచేస్తుంది. ఈ గుజ్జుని వేళ్ళతో రాసుకొని మృదువుగా మర్దన చేసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు పోవడమే కాకుండా చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.