శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 12 జనవరి 2016 (12:06 IST)

జ్వరాన్ని తగ్గించే బెండకాయ.. ఏవిధంగా?

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, మానవుడికి ప్రకృతి ప్రసాదించిన గొప్పవరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తెలుసు. అన్నంతో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావలససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి. అటువంటి కూరగాయలో ఒకటైన బెండకాయ యొక్క ఉపయోగాలు గురించి తెల్సుకుందాం!
 
బెండకాయలోని మ్యూకస్ వంటి పదార్థం కడుపులో మంట నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పీచు, విటమిన్‌ సి దీనిలో చాలా ఎక్కువ. దీనిలోగల డయూరిటిక్ లక్షణాల వల్ల యూనరీ ట్రాక్ట్ ఇంఫెక్షన్‌ను నయం చేయడంలో సహకరిస్తుంది. బెండకాయ డికాక్షన్ తాగితే జ్వరము తగ్గుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కోసి నీటిలో మరిగించి చల్లారేక తాగితే టెంపరేచర్ తగ్గును.
 
బెండకాయ ముక్కలుగా చేసి గ్లాసు నీటిలో రాత్రంతా ఉంచి, మర్వాటి రోజు ఉదయం ముక్కలు తీసివేసి ఆ నీటిని త్రాగాలి. ఇలా రెండు వారాలు పాటు త్రాగితే చక్కెర స్థాయిలు తగ్గుతుంది. దీనిలో ఉండే పెక్టిన్‌ బ్లడ్ కొలెస్టెరాల్‌ను తగ్గిస్తుంది. బెండకాయలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది. బెండకాయలో బరువు తగ్గించే గుణం ఉంది. కాబట్టి రెగ్యులర్ డైట్‍‌లో ఏదో ఒకవిధంగా చేర్చుకోవడం మంచిది.
 
బెండకాయలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తం గడ్డకట్టకుండా మరియు ఎముకలను స్ట్రాంగ్‌గా తయారుచేయడంలో బెండకాయ సహాయపడుతుంది. ఆస్తమాతో ఎవరైతే ఎక్కువగా బాధపడుతున్నారో అటువంటి వారు బెండకాయను రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల సమస్య నుండి విముక్తి కలుగుతుంది.