గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 3 ఫిబ్రవరి 2016 (09:23 IST)

కొవ్వును పెరగకుండా చేసే బ్లాక్ రైస్.. ఆరోగ్యానికి ఎంతోమేలు

సాధారణంగా ప్రతి ఒక్కరూ తెల్లన్నం తింటుంటారు. కానీ, అపుడప్పుడు కాస్తంత వెరైటీ కోసం నల్లటి బియ్యంతో తయారు చేసిన అన్నం కూడా ఆరగించాలి. ఇవి రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. నల్లబియ్యంతో బోలెడన్ని కొత్తరకం వంటల్ని కూడా చేసుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే బ్లాక్ రైస్‌లో... బ్లాక్‌ కాఫీ, టీలలో ఉండే లక్షణాలు ఎక్కువగానే ఉన్నాయి. 
 
ముఖ్యంగా.. ఇందులో ఉండే అంథోసైనిన్స్‌ అనే రసాయన పదార్థం హృద్రోగాలను అడ్డుకునే శక్తి ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ గుండె కవాటాల్లో పూడికలొచ్చి.. గుండెజబ్బులొచ్చే ప్రమాదం సహజం. కొవ్వుశాతం పెరగడం కూడా దీనికి ఒక కారణం. శరీరంలో కొవ్వును పెరగకుండా చూసే లక్షణాలు బ్లాక్‌రైస్‌కు ఉందట. దీంతోపాటు అల్జీమర్స్‌, డయాబెటీస్‌, క్యాన్సర్‌ వంటి మొండి జబ్బుల్ని అడ్డుకునే శక్తి ఈ నల్ల బియ్యానికి ఉంది.