గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2016 (09:05 IST)

యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... ఎందుకు?

శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు అందంతో పాటు మన ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. మరి వాటిని ఎప్పటికప్పుడు తొలగించాలంటే ఆహారంలో కొన్ని ముఖ్యమైన ఆహారపదార్థాలు క్రమంగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం!
 
బీట్‌రూట్‌ దుంపలో బి3, బి6లతోపాటూ విటమిన్‌ సి మొదలగు విటమిన్లు ఉంటాయి. ఇవి వ్యర్థాలను తొలగించేలా చేస్తాయి. కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే పీచు జీర్ణశక్తిని పెంచుతుంది. 
 
యాపిల్ పండుని రోజుకొకటి తిన్నా చాలు... సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. అదేసమయంలో యాపిల్‌లో లభించే పీచు వ్యర్థాలను చాలా సులువుగా తొలగిస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. దానివల్ల కూడా వ్యర్థాలు సులువుగా దూరమవుతుంది.
 
దానిమ్మ గింజలు వ్యర్థాలను తొలగించేందుకు దోహదపడుతుంది. దానిమ్మ గింజల్లో ఉండే ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బు, మధుమేహం లాంటివి రాకుండా కాపాడుతుంది.