గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : సోమవారం, 8 ఫిబ్రవరి 2016 (12:10 IST)

కప్పు కాఫీతో స్కిన్ కేన్సర్‌ నివారణ.. ఎలా?

ప్రతిరోజూ ఒక కప్పు కాఫీతో స్కిన్ కేన్సర్‌కు చెక్ పెట్టవచ్చునని తాజా అధ్యయనంలో తేలింది. కాఫీలోని కఫైన్‌తో పాటు శరీరానికి వ్యాయామం తోడైతే చర్మ సంబంధిత క్యాన్సర్‌ను నియంత్రించవచ్చునని న్యూజెర్సీలోని రుట్జెర్స్ ఎర్నెస్ట్ మరియో స్కూల్ ఆఫ్ ఫార్మసీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. 
 
ప్రతి రోజు ఒక కప్పు కాఫీతో పాటు సూర్యరశ్మి చర్మంపై పడేలా వ్యాయామం చేసే వారిలో చర్మ క్యాన్సర్‌ లక్షణాలు చాలావరకు తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే స్కిన్ క్యాన్సర్‌కు సూర్యరశ్మి నుంచి విడుదలయ్యే డి విటమిన్‌తో పాటు కాఫీలోని కఫైన్ మంచిగా పనిచేస్తుందన్నారు. రోజూ కాఫీ, వ్యాయామం చేస్తుండటం ద్వారా 61 శాతం స్కిన్ క్యాన్సర్ దూరమవుతుంది. ఇంకా కాఫీ తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని అధిక కొవ్వు 63 శాతం వరకు తగ్గుతుంది.