గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 డిశెంబరు 2016 (12:22 IST)

పని ఒత్తిడి.. కూర్చున్న చోటు నుంచి లేవట్లేదా? కూరలో అన్నం కలిపే అలవాటుంటే?

పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అదే పనిగా విధుల్లో నిమగ్నమవుతున్నారా? అయితే ఒబిసిటీ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకే చోట కూర్చోకుండా అరగంటకోసారి లేచి రెం

పని ఒత్తిడితో కూర్చున్న చోటు నుంచి లేవకుండా అదే పనిగా విధుల్లో నిమగ్నమవుతున్నారా? అయితే ఒబిసిటీ సమస్య ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఒకే చోట కూర్చోకుండా అరగంటకోసారి లేచి రెండు నిమిషాలు అటూ ఇటూ తిరగాలి. ఇలా చేయడం ద్వారా శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. మెడ, వెన్ను నొప్పి వంటివీ దూరంగా ఉంటాయి.
 
ఇంకా ఒబిసిటీని దూరం చేసుకోవాలంటే.. ఉదయాన్నే తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవాలి. ఆకలి, నీరసంతో పనిచేయగలం అంటే అనారోగ్యానికి దారితీస్తుంది. ఆహారం తీసుకోవడానికి వీలుకాకపోతే డ్రైఫ్రూట్స్‌ను వెంట తెచ్చుకొని తింటూ ఉంటే శరీరానికి తక్షణ శక్తి అందుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు మనసు టీ, కాఫీల మీదకు లాగుతుంది. అదే పనిగా కాకుండా రోజులో రెండు కప్పులకు మించి తీసుకోకపోవడం మంచిది. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం మంచిది. మధ్యాహ్న భోజనంలో నూనెలో వేయించిన పదార్థాలను తీసుకోకుండా వాటిని దూరంగా ఉంచితే మంచిది. అన్నంలో కూరకలిపే పద్ధతిని మాని, కూరలో అన్నం కలిపే అలవాటు చేసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి చాలా మంచిది. కేలరీలు తక్కువగా ఉండి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. పండ్ల ముక్కలను సాయంత్రం స్నాక్స్‌కు తీసుకోవచ్చు. వాటి నుంచి పోషకాలు అందుతాయి. 
 
కంప్యూటర్ల ముందు గంటల తరబడి పనిచేసేవారు ప్రతి ఇరవై నిమిషాలకోసారి కళ్లు మూసి తెరుస్తూ ఉండాలి. దానివల్ల కళ్లు అలసటకు గురికాకుండా ఉంటాయి. బందువులు, స్నేహితులతో సరదాగా గడపటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. ఆయుష్షు పెరుగుతుంది. 
 
రోజుకు ఒక అర్థగంట లేదా 45నిమిషాల నడక ఆరోగ్యానికి అత్యంత అవసరం. బలమైన ఆరోగ్యకర ఆహారాన్ని తీసుకోవాలి. ఫాస్ట్‌ఫుడ్స్‌ను తినటం మానాలి. ప్రోటీన్లు, పీచు అధికంగా ఉండే ఆహారం తీసుకోవటం అత్యుత్తమం. మొలకెత్తిన విత్తనాలలో కొబ్బరి క్యారెట్‌లను తురిమి కొతిమీరతో కలిపి డేట్స్‌తో సహా అల్పాహారంగా తీసుకోవాలి. గోంగూర, తోటకూర, పాలకూర, బచ్చలికూర లేదా క్యారట్‌రసం సేవించటం చాలా మంచిది. ఆకుకూరలన్నింటిలో మునగాకు అత్యంత బలమైన ఆహారం అన్న విషయాన్ని మరువకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.