గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: బుధవారం, 12 జులై 2017 (21:56 IST)

టీలో పాలు కలపకుండా తాగితే ప్రయోజనం ఏంటి?

పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. బ్లాక్ టీ సేవించే వారిలో డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని అధ్యయనంలో వెల్లడైంది. డైలీ టైమ్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 50 దేశాల్లో అత

పాలు కలపని తేనీరు అంటే బ్లాక్ టీ మధుమేహానికి ఎంతో మేలు చేస్తుందని అధ్యయనంలో తేలింది. బ్లాక్ టీ సేవించే వారిలో డయాబెటిస్ టైప్-2 వచ్చే అవకాశాలు చాలామటుకు తక్కువని అధ్యయనంలో వెల్లడైంది. డైలీ టైమ్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం 50 దేశాల్లో అత్యధిక ప్రజలు పాలు కలపని బ్లాక్ టీని సేవిస్తున్నారు. ఈ దేశాల్లో మధుమేహం వ్యాధిగ్రస్తుల సంఖ్య ఇతర దేశాలకంటే తక్కువేనని అధ్యయనం తేల్చింది. 
 
ఇంకా బ్లాక్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఓ వరప్రసాదమని పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. ఐర్లాండ్‌లో ఏడాది ఒక వ్యక్తి రెండు కిలోల బ్లాక్ టీ సేవిస్తున్నట్లు అధ్యయనం తేల్చింది. దీనికి తర్వాతి స్థానాల్లో బ్రిటన్, టర్కీలు సొంతం చేసుకున్నాయి. ఈ దేశాల్లో టైప్- 2 డయాబెటిస్ సోకిన వారి సంఖ్య చాలా తక్కువ అని తెలియవచ్చింది.