శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 7 ఏప్రియల్ 2017 (12:25 IST)

నగరంలో ఉంటున్నారా? స్నాక్స్ విషయంలో జాగ్రత్త.. చాట్ ఐటమ్స్ వద్దు.. డ్రై ఫ్రూట్సే ముద్దు..

సిటీ జనం ఫుల్‌గా లాగించేస్తున్నారు.. పుష్ఠిగా మూడు పూటలు కాకుండా నాలుగు పూటలు ఆహారం తీసుకుంటున్నారు. గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చున్నా.. తిండి విషయంలో మాత్రం రాజీపడట్లేదు. కానీ వ్యాయామం చేసేందుక

సిటీ జనం ఫుల్‌గా లాగించేస్తున్నారు.. పుష్ఠిగా మూడు పూటలు కాకుండా నాలుగు పూటలు ఆహారం తీసుకుంటున్నారు. గంటలు గంటలు కంప్యూటర్ల ముందు కూర్చున్నా.. తిండి విషయంలో మాత్రం రాజీపడట్లేదు. కానీ వ్యాయామం చేసేందుకు మాత్రం టైమ్ లేదంటూ సిటీ జనం సాకులు చెప్తున్నారు. తద్వారా శారీరక శ్రమ లేకపోవడానికి తోడు టేస్టు కోసం పాకులాడుతూ.. ఇష్టానుసారంగా ఆహారం తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహార విషయంలో పద్ధతుల్ని పాటించకపోతే.. అనారోగ్య సమస్యలు తప్పవని వారు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్‌లో ఆయిల్ పదార్థాలు లేకుండా చూసుకోవాలి. మంచూరియాలు, నూడిల్స్ వంటి వెరైటీల జోలికి పోకుండా.. స్నాక్స్‌గా తృణధాన్యాలు, రాగి జావ వంటి వాటికి అలవాటు పడితే ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఒబిసిటీ, డయాబెటిస్ వంటి రోగాలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. 
 
డైటింగ్ చేస్తున్నామంటూ.. సాయంత్రం పూట వేడి వేడి బజ్జీలు లాగించడం.. పానీపూరీలు వంటా చాట్ ఐటమ్స్‌ను కడుపునిండా లాగించడం ద్వారా ఆరోగ్య ప్రయోజనం శూన్యం. కాబట్టి స్నాక్స్ టైమ్‌లో వెరైటీ దోసెలు, డ్రైఫ్రూట్స్, పండ్ల ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరదోస ముక్కలు వంటివి తీసుకుంటే సిటీ లైఫ్‌కు ఛాలెంజ్ చేస్తూ.. అనారోగ్యాలను తరిమికొట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.