Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేసవిలో ఉదయం పూట అల్పాహారంలో నూనె వద్దే వద్దు..

శుక్రవారం, 10 మార్చి 2017 (13:29 IST)

Widgets Magazine

వేసవి కాలం వచ్చేస్తోంది. అప్పుడే ఎండలు భగ్గుమంటున్నాయి. ఈ కాలంలో ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్యంపై అధిక శ్రద్ధ పెట్టాలి. ప్రతిరోజూ కొబ్బరి నీళ్లు, పళ్లరసాలు, మంచినీళ్లు, మజ్జిగ, తాటిముంజెలు తీసుకోవాలి.

ముఖ్యంగా ఉదయం పూట తీసుకునే టిఫిన్స్ కానీ, సాయంత్రం పూట తీసుకునే స్నాక్స్ కానీ నూనె లేనివి తీసుకోవడం ఉత్తమం. బార్లీ గింజల్లో నీరు పోసి ఉడికించి.. ఆపై అందులో ఉప్పు లేదా బెల్లం, నిమ్మరసం కానీ వేసుకుని తాగితే చలవ చేస్తుంది. ఈ నీరు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
ఎండాకాలంలో చెర్రీ, బెర్రీలు.. బొప్పాయి, యాపిల్ వంటి పండ్లతో పాటు నిమ్మజాతి పండ్లు.. ఎండు ద్రాక్షలు, ఉల్లిపాయ ఎక్కువగా తీసుకోవాలి. తద్వారా అలసటను తగ్గించుకోవచ్చు. రోజూ ఒక గ్లాసుడు నిమ్మరసంలో పుదీనా చేర్చి తీసుకోవడం ద్వారా నీరసం తగ్గిపోతుంది. ఇంకా కాలేయం పనితీరు మెరుగుపడుతుంది.

మెటబాలిజం మెరుగుపడుతుంది. అలాగే వాటర్‌మెలాన్ జ్యూస్ రోజూ తీసుకోండి. 90 శాతం ఇందులో నీటి శాతం ఉండటం ద్వారా శరీరానికి ఉత్తేజాన్నిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తుంది. వేసవిలో పుచ్చకాయను తీసుకోవడం ద్వారా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రాత్రిపూట ఛాటింగ్‌లు చేస్తున్నారా? ఫేస్ బుక్ చూస్తున్నారా? ఐతే గోవిందా..?

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయేంతవరకు ఫోన్లు, ట్యాబ్లు, సిస్టమ్‌లలో కూర్చుని కాలం ...

news

కేకులు, బిస్కెట్లు తెగ లాగిస్తున్నారా? ఐతే మెమరీ లాస్ తప్పదండోయ్..

కేకులు, బిస్కెట్లు తెగ లాగిస్తున్నారా? పిల్లలకు స్నాక్స్ బాక్స్‌ను వాటితో ...

news

కాపీ తాగితే ఉన్న మతి పోదు కానీ వెర్రిని తగ్గిస్తుందట..

రోజులో మనం తాగే కప్పు కాఫీ కానీ, టీ కానీ మీలోని చిత్త వైకల్యాన్ని అదుపులో ఉంచుతుందని ...

news

కాకరలో ఏముంది?

కాకరకాయలో.... కొవ్వు - 0.17 గ్రాములు, పీచు- 2.80 గ్రాములు, నియాసిన్ - 0.400 ...

Widgets Magazine