బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 25 జులై 2016 (12:06 IST)

వేడి నీటితో స్నానం చేస్తున్నారా? ఐతే వ్యాయామం చేయనక్కర్లేదట!

వేడి నీటితో స్నానం చేస్తున్నారా? అయితే వ్యాయామం చేయనక్కర్లేదులెండి. నిజమేనా? అని షాకవుతున్నారా? నిజమేనండి. ఉద్యోగాలు, ఇంటికొచ్చినా పనుల్లో పడి వ్యాయామం చేయలేకపోతున్నామని చింతిస్తున్నారా? అయితే ఇక బాధప

వేడి నీటితో స్నానం చేస్తున్నారా? అయితే వ్యాయామం చేయనక్కర్లేదులెండి. నిజమేనా? అని షాకవుతున్నారా? నిజమేనండి. ఉద్యోగాలు, ఇంటికొచ్చినా పనుల్లో పడి వ్యాయామం చేయలేకపోతున్నామని చింతిస్తున్నారా? అయితే ఇక బాధపడక్కర్లేదు. వేడి నీటితో స్నానం చేస్తేనే చాలు.. వ్యాయామం చేసిన ఫలితాలు వస్తాయని శాస్త్రవేత్తలంటున్నారు. 
 
సాధారణంగా వ్యాయామం చేసినప్పుడు శరీరంలో వేడిపుడుతుంది. అలాగే వేడి నీటితో స్నానం చేసినా అదే వేడిపుడుతుందని యూకేలోని లుఫ్‌బురో యూనివర్సిటీకి చెందిన స్టీవ్‌ ఫాల్కనర్‌ తెలిపారు. వేడినీటితో తరచూ స్నానం చేయడం ద్వారా రక్తప్రసరణ పెరిగి, రక్తపోటు తగ్గుతుందని, తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయని పరిశోధకులు తెలిపారు. ఎక్కువ సేపు వేడినీటితో స్నానం చేయడం వల్ల 140 కెలరీలు ఖర్చయ్యాయని, ఇది 30 నిమిషాలు వడివడిగా నడవడంతో సమానమని వారు చెప్తున్నారు. 
 
ఇకపోతేయయ 2300 మందిపై ఈ పరిశోధన జరిగింది. 20 ఏళ్ల పాటు జరిగిన ఈ పరిశోధనలో వారంలో ఓససారి వేడినీటి స్నానం చేసే వ్యక్తుల్లో సగం మంది కొంత కాలానికే చనిపోగా, వారంలో రెండు, మూడుసార్లు వేడినీటి స్నానం చేసిన వ్యక్తుల్లో 38 శాతం మందే మరణించినట్లు పరిశోధనలో వెల్లడైంది.