శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2016 (17:53 IST)

రక్తపోటును నివారించే పొటాషియం.. బంగాళాదుంపలో పుష్కలం...

మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు.

మంచి నిద్ర మంచి ఆరోగ్యానికి సూచన. మన ఆరోగ్యం సక్రమంగా ఉందంటే నిద్ర కూడా ప్రశాంతంగా పడుతుంది. ఒకవేళ మన నిద్రలో అనేక సమస్యలు కనిపిస్తున్నాయనుకోండి... అవి మన ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతున్నాయనుకోవచ్చు. ఉదాహరణకు మనకు నిద్రాభంగం కలిగిస్తూ, కనిపించే అనేక సమస్యలు నిజానికి మిమ్మల్ని హెచ్చరిస్తున్నట్లుగా పరిగణించాలి. 
 
నిజానికి మనకు అవసరమైన లవణాల్లో ఒకటైన పొటాషియమ్ శరీరంలో లోపించిందనుకోండి.. ఏం జరుగుతుందో తెలుసా? అసలు గుండె కొట్టుకోవడమే జరగదు. కండరం బిగుసుకోవడం జరగదు. అంటే మనందేన్నీ పట్టుకోవడం జరగదు. అంతెందుకు అసలు కదలడమే సాధ్యంకాదు. 
 
ఒక వేళ పొటాషియమ్ తక్కువుగా ఉంటే మీరు చదువుతున్న మ్యాటర్ అసలు అర్థం కాదు! ఎందుకంటే మెదడులో కణాలు పనిచేయడానికి కూడా పొటాషియమ్ కావాల్సిందే. పైగా రక్తపోటును నివారించే గుణం పోటాషియమ్‌కు ఉంది.  
 
మరి పోషకంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ లవణం కోసం తీసుకోవాల్సిన ఆహారాలేమిటో తెలుసా? మనకు అందుబాటులో ఉండేది అరటిపండు. ఒక అరటిపండులో 400 మి.గ్రా పొటాషియమ్ ఉంటుంది. ఇంకా పొటాషియమ్ కోసం బంగాళా దుంపను కూడా ఆశ్రయించవచ్చు. ఒక పెద్ద ఆలు గడ్డలో 1600 మి.గ్రా పొటాషియమ్ ఉంటుంది.