Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మానసిక ఒత్తిడి... టీనేజర్లపై కన్నేయాల్సిందే...

శనివారం, 15 జులై 2017 (22:28 IST)

Widgets Magazine
depression

సాధారణా టీనేజర్లు, చిన్న పిల్లలు ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్‌కు లోనవుతుంటారు. వారి దినచర్యల్లో హాని కలిగించేలా ఎవరైనా ప్రవర్తించినా.. ఏదైనా సంఘటన చోటు చేసుకున్నా, ఏదైనా అనుకున్నది జరుగక పోయినా పూర్తి డిప్రెషన్‌కు లోనవుతుంటారు. 
 
దీని నుంచి బయటపడాలన్న ఆలోచన వారికి ఉన్నప్పటికీ.. చాలా కష్టసాధ్యంగా మారుతుంది. అయితే, దీన్ని పెద్దలు ముందుగా గ్రహించి తగిన సూచనలు, సలహాలు, ఇవ్వడం వల్ల కొంతమేరకు బయటపడొచ్చు. అయితే పిల్లలు డిప్రెషన్‌కు లోనైన విషయాన్ని ఏ విధంగా కనుగొనవచ్చు. ఇందుకు మానసిక వైద్యులు, సైకలాజిస్టులు కొన్ని సూచనలు చేస్తున్నారు. పిల్లల ప్రవర్తనను బట్టి వారు డిప్రెషన్‌ మూడ్‌లో ఉన్నారని గుర్తించవచ్చని అంటున్నారు. 
 
టీనేజర్లు చాల త్వరగా ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకోవడం, అందరి మీదా విసుక్కోవడం చేస్తుంటే వారు డిప్రెషన్‌కి దగ్గరవుతున్నారని పెద్దలు గ్రహించాలి. కుటుంబ సభ్యులకీ, స్నేహితులకీ దూరంగా ఉంటూ, శుభకార్యాలలో పాల్గొనకుండా ఉంటే దానిని బిడియం అని భావించకండి. పిల్లలు తీవ్ర డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అందరికీ దూరంగా ఒంటరిగా ఉండాలని కోరుకుంటారు. ఈ పరిస్థితి నుంచి వారిని సాధ్యమైనంత త్వరగా బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రులు కృషి చేయాలని వారు చూపిస్తున్నారు.  
 
డిప్రెషన్‌లో ఉన్న పిల్లలను వీలైనంత వరకు ఒంటరిగా ఉండకుండా చూడాలి. ఒంటరిగా ఉండడం వల్ల తరుచుగా అవే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒంటరితనం వారిని మరింతగా డిప్రెషన్‌కు గురిచేసే ప్రమాదం ఉంది. కొందరు పిల్లలు తీవ్ర డిప్రెషన్‌కు లోనైనప్పుడు ఆత్మహత్యాయత్నానికి కూడా ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. 
 
తరుచూ చనిపోవాలని ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటపుడు వారిని గమనిస్తూ ఉండాలి. పిల్లలు ఈ స్థితికి రాక ముందే పెద్దలు సకాలంలో స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి వైద్యుడిని సంప్రదించి డిప్రెషన్‌ నుంచి తొందరగా తేరుకునేలా చూడాలని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అరటికాయ తింటే.. బరువు తగ్గుతారు..

అరటిపండు తింటే లావైపోతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే పచ్చిఅరటితో బరువును ...

news

రోజూ 10-12 బాదం పప్పుల్ని నానబెట్టి తింటే వీర్యం...?

నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నరాలను ...

news

బొప్పాయి ఆకులను మెత్తగా నూరి అక్కడ కడితే...?

* బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ...

news

ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?

రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ...

Widgets Magazine