Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. తేలికపాటి ఆహారం.. తగినన్ని నీరు తీసుకోండి..

సోమవారం, 20 మార్చి 2017 (17:52 IST)

Widgets Magazine
summer

వేసవి కాలం.. ఎండల ధాటికి వడదెబ్బ ప్రభావం శరీరంపై పడే అవకాశం ఉంది. శరీరంలో నీటిశాతం తగ్గితే వడదెబ్బ తగులుతుంది. అందుచేత వేసవిలో శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలి. ఇంకా ఎండల్లో ఎక్కువ తిరకుండా ఉండాలి. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
వడదెబ్బకు గురైన వారిలో వేవిళ్లు, తలతిరగడం, జ్వరం రావడం.. చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్‌తో పల్స్‌ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటంవంటి లక్షణాలు కనబడతాయి. వీటి ద్వారా ఆకస్మిక మరణం కూడా సంభవించవచ్చు. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే... శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం చేయాలి. 
 
అధికంగా ఎండలో తిరగడం ద్వారా.. మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాం. తద్వారా అత్యధికంగా వడదెబ్బతో మరణాలు చోటుచేసుకుంటాయి. వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి. బట్టలు వదులు చేసి నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలని వారు చెప్తున్నారు. 
 
ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చికెన్ తింటున్నారా? కోడి మెడను, రెక్కల్ని మాత్రం పక్కనబెట్టేయండి..

చికెన్ ముక్కలేనిదే ముద్ద దిగట్లేదా? కోడి కూర, లేదా ఇతరత్రా వెరైటీలు టేస్టీగా వండిపెడితే ...

news

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? ఐతే ఇవి తీసుకోండి..

ఒంట్లో నీరు చేరిందని డాక్టర్లు చెప్పారా? అయితే మందులు వాడటం చేస్తున్నారా? అయితే కాస్త ...

news

సెల్ ఫోన్ రేడియేషన్ పుణ్యంతో పిచ్చుకలు మాయం.. కాపాడండి.. మహాప్రభో..!

ఆధునీకరణ పేరుతో ప్రకృతి సంపద కనుమరుగువుతూ వస్తున్నాయి. నగరాభివృద్ధి కోసం భవనాల సంఖ్య ...

news

టీ తాగు హాయ్ హాయ్... మతిమరుపు నై నై..

టీ కెటిల్‌ నుంచి వస్తున్న కమ్మని వాసనను ఆఘ్రాణిస్తూ... గుక్క గక్కనూ ఆస్వాదిస్తూ తాగండి. ...

Widgets Magazine