శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 18 డిశెంబరు 2017 (09:45 IST)

షేక్‌హ్యాండ్‌ ఇస్తే చేతులు కడుక్కోండి.. లేదంటే?

శీతాకాలంలో ఇతరులకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారా? అయితే చేతుల్ని తప్పకుండా కడిగేసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. దగ్గు, జలుబు బాధపడుతున్న వారు, గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చున

శీతాకాలంలో ఇతరులకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారా? అయితే చేతుల్ని తప్పకుండా కడిగేసుకోవాల్సిందేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. దగ్గు, జలుబు బాధపడుతున్న వారు, గంటల పాటు కంప్యూటర్ల ముందు కూర్చుని వాడిన కీబోర్డ్, మౌస్‌లను మళ్లీ మళ్లీ వాడేవారితో షేక్ హ్యాండ్ ఇస్తే వెంటనే చేతులను శుభ్రం చేసుకోవాలి. లేకుంటే రాత్రి లోపు బ్యాక్టీరియా మీ చేతులకు అంటుకుపోవడం ఖాయమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా జలుబు చేసిన వారితో షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తే కంటికి, చర్మానికి అలర్జీ ఏర్పడుతుంది. అందుకే చేతులను షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే కడిగేయాలి. కానీ మొహమాటానికి పోతే మాత్రం వ్యాధులను కొనితెచ్చుకున్నట్లే. 
 
రెండు చుక్కల హ్యాండ్ వాష్‌తో చేతులను గంటకోసారి శుభ్రం చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఏర్పడవు. ముఖ్యంగా పిల్లలకు చేతులను శుభ్రం చేసుకోవడం అలవాటు చేయాలని.. తద్వారా జలుబు, దగ్గు మాయమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.