గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (10:28 IST)

షేవింగ్ ఆయిల్ రాసుకుని షేవింగ్ చేసుకుంటే...

రేజర్‌తో షేవింగ్‌ చేసుకోవడం వల్ల ముఖంపై మంటపుడుతుంది. దీనికితోడు షేవింగ్‌ చేసే క్రమంలో చర్మం కట్‌ అయ్యి మంట తీవ్రత ఇంకా పెరుగుతుంది. ఇలాకాకుండా షేవింగ్‌ ప్రక్రియ సున్నితంగా జరిగేందుకు, చర్మం కాంతివంతంగా కనిపించేందుకు కొన్ని సింపుల్‌ టిప్స్ ఉన్నాయి. షేవింగ్‌ ఆయిల్‌ రాసుకుని షేవ్‌ చేసుకుంటే వెంట్రుకలు మందంగా ఉన్నా షేవింగ్‌ చేసుకోవడం తేలికవుతుంది. షేవింగ్‌ చేసుకునే కొన్ని నిమిషాల ముందు ఈ ఆయిల్‌ రాసుకోవాలి. 
 
స్క్రబ్‌లో ఉండే గ్రాన్యూల్స్‌ చర్మాన్ని మృదువుగా చేస్తాయి. దుమ్ము, జిడ్డుల్ని లోతుల నుంచి తొలగించడమేకాకుండా షేవింగ్‌ చేసుకునేటప్పుడు వెంట్రుకలు సులభంగా ఊడి వచ్చేలా చేస్తుంది స్క్రబ్‌. దానివల్ల ముఖం మండకుండా, చర్మంపై కోతలు పడకుండా ఉంటుంది. అప్పటివరకు నిర్జీవంగా ఉన్న చర్మం మెరిసిపోతుంది, ఆరోగ్యంగా కనిపిస్తుంది.
 
ఎక్కువమంది క్లెన్సింగ్‌ కోసం చాలామంది సబ్బులు వాడుతుంటారు. అలాకాకుండా మాయిశ్చరైజర్‌ అందించే సబ్బులు వాడితే మంచిది. విటమిన్‌ ఇ, ఆలివ్‌ ఆయిల్‌ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. ముఖం కడుక్కున్న తర్వాత చర్మం బిగుతుగా అనిపించడం లేదా దురద పెట్టడం వంటివి ఉంటే లిక్విడ్‌ క్లెన్సర్‌లు వాడడం మంచిది.
 
షేవింగ్‌ పూర్తయ్యాక మిగిలిపోయిన షేవింగ్‌ క్రీమ్‌తో ఒకసారి గెడ్డాన్ని తుడిచి ఆరనివ్వాలి. షేవింగ్‌ తర్వాత చర్మం మృదువుగా ఉండేందుకు ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌ రాసుకుని మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. దీనివల్ల ఆఫ్టర్‌ షేవ్‌ లోషన్‌లో ఉండే ఆస్ట్రిజెంట్స్‌ ముఖచర్మాన్ని బిగుతుగా చేస్తుంది.