గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 19 జులై 2016 (17:54 IST)

గురక తగ్గాలంటే.. ఆలివ్ ఆయిల్.. తేనె చాలు: నిద్రించే ముందు ఏం చేయాలంటే?

ప్రశాంతమైన నిద్రను గురక దూరం చేస్తుంది. గురక తీసే వ్యక్తి కాదు.. ఆయన చుట్టూ వుండే వారికి నిద్రాభంగం కలుగుతుంది. స్థూలకాయం, సైనుసైటిస్ మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఉన్నపుడు

ప్రశాంతమైన నిద్రను గురక దూరం చేస్తుంది. గురక తీసే వ్యక్తి కాదు.. ఆయన చుట్టూ వుండే వారికి నిద్రాభంగం కలుగుతుంది. స్థూలకాయం, సైనుసైటిస్ మలబద్ధకం, ఆస్తమా, వాతావరణ మార్పులు, మానసిక ఒత్తిడి వంటివి ఉన్నపుడు గురకపెట్టడం జరుగుతుంది. అలాగే మద్యపానం, ధూమపానం చేసేవారిలో కూడా గురక పెట్టే అలవాటు ఉంటుంది. గురకతో పక్కవారికి ఇబ్బంది మాటెలా ఉన్నప్పటికీ దీని వల్ల గుండెపరమైన సమస్యలు కూడా తలెత్తుతాయి.
 
సాధారణంగా నిద్ర అనేది ప్రశాంతతను ఇస్తుంది. ఆయువును పెంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది. అలాంటి నిద్రకు విపరీతమైన భంగం కలిగించే గురక గురించి తెలుసుకోండి. నోరు మూసుకుని గురకపెడితే నాలుకలోనే ఏదో సమస్య ఉందని గమనించాలి. నోరు తెరుచుకుని గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకొని గురకపెడితే ప్రధాన సమస్యగా గుర్తించాలి. ఏ రకంగా నిద్ర పోయినా గురక వస్తుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి. 
 
గురక తగ్గించాలంటే.. 
* చెరో అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, తేనె కలిపి రాత్రి నిద్రించే ముందు తాగినట్లైతే మంచి ఫలితం కనబడుతుంది.
*  రాత్రి నిద్రించే ముందు మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టాలి. 
* ఒక గ్లాసు వేడి నీటిలో అర టీ స్పూన్‌ యాలకుల చూర్ణం కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.