గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 మార్చి 2017 (13:11 IST)

ఇబూప్రోఫెన్ అతిగా వాడితే.. హృద్రోగ సమస్యలు తప్పవు

ఇబూప్రోఫెన్ తీసుకుంటున్నారా? అయితే కార్డియా ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. వైద్యుల సలహా కూడా తీసుకోకుండా, ఎంతోమంది తమంతట తాము ఈ మందులను కొనుక్కుని వాడుతున్నార‌ని.. అలాంటి వాటితో హృద్రోగ స

ఇబూప్రోఫెన్ తీసుకుంటున్నారా? అయితే కార్డియా ముప్పు పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. వైద్యుల సలహా కూడా తీసుకోకుండా, ఎంతోమంది తమంతట తాము ఈ మందులను కొనుక్కుని వాడుతున్నార‌ని.. అలాంటి వాటితో హృద్రోగ సమస్యలు 31 శాతం అధికమని డెన్మార్క్ పరిశోధకులు తెలిపారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని తీసుకుంటే ప్రజారోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని పరిశోధకులు అంటున్నారు.
 
అయితే, నొప్పి నివారణ మందులన్నీ ప్రమాదకరం కాద‌ని అధికంగా వాడుతున్న‌ ఇబూప్రోఫెన్, డైక్లోఫెనాక్‌ల వల్లే ఈ ముప్పు అధికంగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు ఇలాంటి మందులను సొంతంగా వాడకూడ‌ద‌ని సూచిస్తున్నారు.  
 
డెన్మార్క్‌లో 2001 నుంచి 2010 వరకు కార్డియాక్ అరెస్టుతో బాధపడిన సుమారు 29వేల మంది రోగులను ప‌రిశీలించిన శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని కనుగొన్నారు. కేవలం ఇబూప్రోఫెన్ మాత్రమే కాకుండా డైక్లోఫెనాక్ వల్ల కూడా ఇదే తరహా ముప్పు 50 శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అస‌లు ఇటువంటి నొప్పి నివారణ మందుల అమ్మకాలను నియంత్రించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
 
పదేళ్ల పరిశోధనలో 28,947 మంది పేషెంట్లు ఇబూప్రోఫెన్ వాడటం ద్వారా గుండె సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడ్డారని, చిన్నపిల్లల్లో ఇబూప్రోఫెన్ వాడకం ద్వారా హృద్రోగ సమస్యలు తలెత్తే అవకాశం 31 శాతం ఉన్నట్లు తేలిందని..  ఇబూప్రోఫెన్ లోని డ్రగ్స్ గుండె ఫ్లేట్లెట్లకు హాని చేస్తుందని పరిశోధనలో తేలింది.