గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 29 మార్చి 2017 (15:41 IST)

కాఫీ వద్దు.. చికెన్ సూప్ తీసుకోండి.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోండి..

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. రోజుకు 7- 8 గంటల పాటు నిద్ర అవసరమని.. సరిపడ నిద్రపోవడం ద్వారా హార్మోన్లు సమతుల్యం అవుతాయని.. ద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డైట్‌లో చేప

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే.. రోజుకు 7- 8 గంటల పాటు నిద్ర అవసరమని.. సరిపడ నిద్రపోవడం ద్వారా హార్మోన్లు సమతుల్యం అవుతాయని.. ద్వారా భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరగాలంటే డైట్‌లో చేపలు, తృణధాన్యాలు, బిటాకెరోటిన్, పాలకూర, క్యారెట్ వంటివి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం ద్వారా బరువు తగ్గడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వారంలో కనీసం నాలుగు రోజులైనా వ్యాయామం చేసుకోవడం మంచిది. ఇంకా కాఫీని మానేయడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు పది గ్లాసుల నీరు సేవించడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే..? కార్యాలయాల్లో గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోకుండా.. గంటకోసారి ఐదు లేదా పది నిమిషాలు నడవండి. సెలవు దినాల్లో విహార యాత్రలకు వెళ్లండి.
 
డైట్‌లో చికెన్ సూప్‌ను తీసుకోవాలి. ఇందులోని పోషకాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పెరుగును రోజూ ఒక కప్పు తీసుకోవాలి. సూర్యకిరణాలు శరీరంపై పడేట్లు చూసుకోవాలి. సూర్యోదయ కిరణాలు శరీరంపై పడటం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. అలాగే సూర్య అస్తమయం సందర్భంగా పడే కిరణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆపిల్ పండును రోజుకొకటి తీసుకోవాలి. ఆరెంజ్ పండ్లను డైట్‌లో చేర్చుకోవాలి.