శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 మార్చి 2017 (17:42 IST)

గ్రీన్ టీ రోజుకు 2 కప్పులు ఓకే.. మూడుకు మించితే సంతానం కలుగదా?

బరువు తగ్గాలని తెగ గ్రీన్ టీలు తాగేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మోతాదుకు మించి గ్రీన్ టీ తాగడం ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజు మొత్తంలో ఒకటి లేదా రెం

బరువు తగ్గాలని తెగ గ్రీన్ టీలు తాగేస్తున్నారా? అయితే కాస్త ఆగండి. మోతాదుకు మించి గ్రీన్ టీ తాగడం ద్వారా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. రోజు మొత్తంలో ఒకటి లేదా రెండు కప్పుల గ్రీన్ టీ మాత్రమే సేవించాలి. అంతకుమించి తాగితే స్త్రీలలో సంతానోత్పత్తి తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఎలుకల మీద నిర్వహించిన పరిశోధనలో వారు ఈ విషయాన్ని గమనించినట్లు పరిశోధనలో తేలింది. 
 
గ్రీన్ టీ గుండెకు మేలు చేస్తుది. బరువును తగ్గిస్తుంది. అయితే మోతాకు మించితే.. ఇందులోని ఇంటిగ్రెంట్స్ వల్ల కాలేయానికి ముప్పు తప్పదని పరిశోధనలో వెల్లడి అయ్యింది. గ్రీన్ టీలో పదార్థాలు మెటబాలిక్ రేటును వేగవంతం చేస్తుంది. కెలోరీలను బర్న్ చేస్తుంది. అయితే రోజుకు రెండు కప్పులకు మించితే మాత్రం సంతానోత్పత్తి ప్రక్రియకు దెబ్బ తప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుచేత సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు.