శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 29 ఏప్రియల్ 2017 (10:11 IST)

మాంసాహారం తింటే కాలేయానికి ముప్పా? స్థూలకాయులు నాన్ వెజ్ తినొచ్చా?

మాంసాహారం తింటే కాలేయ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసంతో శరీరంలోకి చేరిన కొవ్వు కాలేయంలో పేరుకుపోతుందని, జంతు మాసంలో ఉండే ఓ రకమైన ప్రొటీన్‌ దీనికి కారణమని.. ఇలా పేర

మాంసాహారం తింటే కాలేయ వ్యాధులు వచ్చే ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మాంసంతో శరీరంలోకి చేరిన కొవ్వు కాలేయంలో పేరుకుపోతుందని, జంతు మాసంలో ఉండే ఓ రకమైన ప్రొటీన్‌ దీనికి కారణమని.. ఇలా పేరుకుపోయిన కొవ్వు హృద్రోగ వ్యాధులకు, కేన్సర్‌కు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
నాన్‌ ఆల్కాహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ డిసీజ్‌(ఎన్‌ఏఎఫ్ఎల్‌డీ)పై దీర్ఘకాలిక నష్టం కలిగించడంతో పాటు లివర్‌ సిర్రోసిస్‌కు దారితీస్తుందని, కాలేయ పనితీరును దెబ్బతీస్తుందని వివరించారు. అలాగే మధుమేహవ్యాధిగ్రస్తులు స్వీట్సు తినడం వల్ల ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నట్లవుతుందో, స్థూలకాయులు మాంసాహారాన్ని తీసుకోవడం వల్ల అదేవిధమైన హాని కలుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
 
ఎప్పుడో ఒకసారి తీసుకుంటే ఫరవాలేదు కానీ, తరచు మాంసాహారం తీసుకోవడం వల్ల ముప్పే. ముఖ్యంగా స్థూలకాయులకైతే మరింత ఇబ్బంది తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.