గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 జులై 2015 (11:08 IST)

''ముద్దు''తో క్యాన్సర్‌ను కొని తెచ్చుకున్నట్లే.. యువతలోనే.. ఎక్కువట..

ముద్దుకు అలవాటు పడితే క్యాన్సర్‌ను కొనితెచ్చుకున్నట్లేనని తాజా పరిశోధనలో తేలింది. ముద్దు ద్వారా హెచ్‌పీవీ అనే వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి సోకడం ద్వారా మౌత్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని సెంటర్స్ ఫర్ డిసీస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మౌత్ క్యాన్సర్‌తో పాటు తల, మెడ క్యాన్సర్లకు కూడా ముద్దుతో వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. 
 
ముద్దు, ఓరల్ సెక్స్ ద్వారా ఓరల్ క్యాన్సర్ ముప్పు పొంచివుందని, అనేక మందితో ఓరల్ సెక్స్, కిస్ ద్వారా క్యాన్సర్ కారకాలు వ్యాపించే అవకాశాలు అధికంగా ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ క్యాన్సర్‌తో మహిళలే ఇబ్బంది పడుతున్నారని.. యువతరంలో యువతలో ఈ క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో తేలిందని వైద్యులు చెప్పారు.