శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శుక్రవారం, 26 మే 2017 (09:20 IST)

డెంగీ వ్యాధిని అమాంతం నిరోధించిన కివీ పండు పళ్లలో రారాజు

కివీ పళ్ల గొప్పదనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డెంగీ వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు కివీ పండ్లు తినిపించాల్సిదిగా చాలామంది వైద్యులు సిఫార్సు చేశారు. ఎందుకంటే కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య ప

కివీ పళ్ల గొప్పదనం గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డెంగీ వ్యాధి ప్రబలిన సమయంలో రోగులకు కివీ పండ్లు తినిపించాల్సిదిగా చాలామంది వైద్యులు సిఫార్సు చేశారు. ఎందుకంటే కివీ పండుతో రక్తంలోని ప్లేట్‌లెట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో రోగనిరోధక శక్తి పెరిగి రోగి త్వరగా కోలుకోవడానికి వీలుపడుతుంది. ఈ కివీ పండులో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తిని విపరీతంగా పెంచుతాయి. కివీ పండును పళ్లలో రారాజుగా చెప్పొచ్చు. అయితే ఈ కివీ పండు కేవలం ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడమే కాదు.. ఇతర పలు అనారోగ్యాలకు కూడా సూపర్ మెడిసిన్‌గా పనిచేస్తుంది. మధుమేహం, గుండె జబ్బులు, నిద్రలేమితో బాధపడేవారికి ఇదొక దివ్య ఔషధం. ఈ కివీ పండును తినడం వల్ల కలిగే మరికొన్ని లాభాల గురించి తెలుసుకుందాం. 
 
విటమిన్ ‘సి’ పుష్కలం
సాధారణంగా నిమ్మ, నారింజ పళ్లలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందని మనం అనుకుంటాం. కానీ కివీలో నిమ్మ, నారింజల కంటే రెండింతలు విటమన్ సి ఉంటుంది. 100 గ్రాముల కివీ పండులో 154 శాతం విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి.. శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
 
నిద్రలేమిని పోగుడుతుంది
నిద్రలేమితో బాధపడుతున్న వారికి దీన్ని మించిన ప్రకృతి ఔషధం మరొకటి లేదు. దీనిలో ఉండే సెరోటొనిన్ నిద్రలేమిని పోగొడుతుంది. మీరు పడుకోవడానికి గంట ముందు రెండు కివీ పళ్లు తింటే హాయిగా నిద్రపోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
 
నేత్ర సంబంధిత వ్యాధులు దూరం
రోజుకు రెండు, మూడు కివీ పండ్లు తింటే నేత్ర సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. వయసు పెరుగుదలతో వచ్చే కణజాల క్షీణతను ఇవి బాగా తగ్గిస్తాయి.
 
జీర్ణక్రియ వేగవంతం
కివీ పండులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే దీనిలో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు మానసిక వ్యాధులను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
 
గుండెకు మేలు
కివీ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు ఉపయోగపడుతుంది. గర్భిణిలు కివీ పండ్లు తింటే మంచి పౌష్టికాహారం లభించడమే కాక బిడ్డ ఎదుగుదలకు అది తోడ్పడుతుంది.
 
షుగర్ లెవెల్ తగ్గుముఖం
రక్తంలోని షుగర్ స్థాయిలను తగ్గించే గుణం కివీకి ఉంది. ఇది మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది.