శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (12:21 IST)

కొవ్వును కరిగించే నిమ్మకాయ.. ఎలాగో తెలుసుకోండి..

విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. ఐరన్‌లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ కేలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జూస్‌తో కూ

విటమిన్ 'సి' పుష్కలంగా ఉండే నిమ్మకాయలో కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి. ఐరన్‌లోపంతో బాధపడేవారు తొందరగా నీరసించే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు ఎక్కువ కేలరీలు ఉన్న స్నాక్స్ తీసుకునే బదులు లెమన్ జూస్‌తో కూడిన సలాడ్ తీసుకుంటే ఎక్కువ శక్తిని ఇవ్వడమే కాకుండా శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుంది 
 
అలాగే, వంటింట్లో అందుబాటులో ఉండే లవంగాలు, మిర్చి, దాల్చిన చెక్క వంటివి కూరల్లో ఎక్కువగా వాడటం వల్ల శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయట. ఈ వేడి శరీర జీర్ణక్రియలో కొద్దిపాటి వృద్ధిని కలిగిస్తుంది. దీనివల్ల బాడీలో ఫ్యాట్ తగ్గే అవకాశం ఉందంటున్నారు. 
 
ప్రధానంగా టమోట, కీరదోస, గుమ్మడిల్లో తక్కువ కేలరీస్ ఉంటాయి. కానీ, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల ఆకలి ఎక్కువగా వేయదు. ఫైబర్ జీర్ణమవ్వడానికి శరీరం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల కొవ్వు సులభంగా కరిగిపోతుంది. 
 
వీటితో ఎక్కువ విటమిన్స్, మినరల్స్ శరీరానికి అందించడమే కాకుండా యాంటీఆక్సిడెంట్స్ జీర్ణక్రియను, శక్తిని స్థాయిలో ఉంచుతాయి. వీటితో పాటు.. బాదంపప్పు, కొబ్బరి నూనె, కోడిగుడ్లు, ఆలివ్ ఆయిల్, తేనె, మజ్జిగ, వెల్లుల్లితో కూడా శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి.