గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 13 మే 2018 (13:47 IST)

కాలేయానికి ఇన్ఫెక్షన్లు సోకకుండా వుండాలంటే? పసుపును?

పాలకూర, తోటకూర తింటే కాలేయ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆకుకూరల్లోని క్లోరోఫిల్‌ కారణంగా రక్తంలోని హానికర రసాయనాలు బయటకుపోయేలా చేయడంలో కాలేయానికి సహకరిస్తాయి.

పాలకూర, తోటకూర తింటే కాలేయ సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆకుకూరల్లోని క్లోరోఫిల్‌ కారణంగా రక్తంలోని హానికర రసాయనాలు బయటకుపోయేలా చేయడంలో కాలేయానికి సహకరిస్తాయి. అలాగే బీటాకెరోటీన్, ఫ్లేవనాయిడ్స్ సమృద్ధిగా వుండే బీట్‌రూట్ కాలేయం ఆరోగ్యంగా పనిచేసేలా చేస్తుంది. 
 
క్యారెట్లూ, అవకాడోలను ఎక్కువగా తీసుకోవడంవల్ల వాటిల్లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలోని హానికర రసాయనాలను తొలగిస్తాయి. అక్రోట్లు కూడా కాలేయానికి టానిక్‌లా పనిచేస్తాయి. పసుపు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కాలేయానికి ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. ఇంకా క్యాబేజీ, బ్రొకోలీలు ఎక్కువగా తీసుకునే వారిలో కాలేయ సమస్యలు వుండవు. 
 
అలాగే తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామర్థ్యాన్ని ఇవి పెంచుతాయి. కాలేయాన్ని శుభ్రపరుస్తాయి. అలాగే ద్రాక్షలో ఎక్కువగా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల కాలేయంలో నిలిచే ఫ్యాట్ ఫుడ్స్‌ను తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.