శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (15:00 IST)

పెళ్లయిన కొత్తల్లో రెచ్చిపోయే మగాళ్ళు... క్రమేణా తుస్‌మంటారు.. కారణమిదే?

సాధారణంగా పెళ్లయిన కొత్తల్లో మగాళ్లు పడక గదిలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అంటే రోజుకు ఐదారు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు.

సాధారణంగా పెళ్లయిన కొత్తల్లో మగాళ్లు పడక గదిలో క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అంటే రోజుకు ఐదారు సార్లు శృంగారంలో పాల్గొంటుంటారు. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ లైంగిక సామర్థ్యం క్రమేణా తగ్గిపోతుంది. ఇది స్త్రీపురుషులిద్దరికీ తీవ్ర అసంతృప్తిని రగిలిస్తుంది. దీనిపై పలువురు పలు విధాలైన కారణాలు చెపుతుంటారు. 
 
వాస్తవానికి చాలా మంది పురుషులు శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతుంటారు. ఈ సమస్య రావడానికి కారణం ప్రోస్టేట్ గ్రంథుల పనితీరు. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, స్ఖలనాన్ని ఆపి ఉంచే సెక్స్ కండరాలు బలహీనంగా ఉండటం, మధుమేహం, బీపీకి వాడే మందులు వంటివాటివల్ల శీఘ్రస్ఖలనం సమస్య వస్తుంది. 
 
ఇవి శారీరక కారణాలైతే వ్యక్తిత్వంలో లోపాలు, తీవ్రమైన ఆందోళనాపూరిత మనస్తత్వం, కోపం, ఉద్రేకం, తొందరపాటుతనం, డిప్రెషన్, మానసికఒత్తిడి వంటి మానసిక అంశాలు కూడా కారణాలుగా ఉంటాయి. శీఘ్రస్ఖలనాన్ని తగ్గించి అంగస్తంభన కాలాన్ని పెంచే చికిత్సా పద్ధతులు సెక్స్ మెరైటల్ థెరపీలో ఉన్నాయి. మానసిక ఆందోళన, ఆవేశం, కోపం, అనుమానం తగ్గించుకోవడానికి సైకోథెరపీ ఉంది. ఈ థెరపీ ప్రకారం నిపుణుల సలహా మేరకు చిట్కాలు పాటిస్తే.. ఆ సమస్య నుంచి వెంటనే బయటపడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే, సమస్యను అధికమించేందుకు చికిత్సతో పాటు కౌన్సెలింగ్‌తోపాటు భార్య సహకారం తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఎందుకంటే… శ్రీఘ్రస్కలనం అనేది సెక్స్‌లో పాల్గొనే సమయంలో ఏర్పడే అభద్రతాభావం, ఆందోళన వల్ల ఏర్పడుతుంది. శృంగారంలో భార్యను సంతృప్తి పరచలేక పోతామేమోనన్న అభద్రతాభావం ఉన్న వారిలోనే ఎక్కువగా ఈ సమస్య ఉంటుందని చెపుతున్నారు. అందువల్ల ఈ సమస్యకు వైద్యులను సంప్రదించడం కంటే జీవిత భాగస్వామితోనే చర్చించాలని సెక్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు.