గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 30 జూన్ 2016 (10:06 IST)

శృంగారానికి దూరంగా ఉంటే ఆయుష్షు ఎంత పెరుగుతుందో తెలుసా?

ప్రతి వ్యక్తికి శృంగారం ఎంతో ముఖ్యం. అది మానవజాతి అయినా.. జంతు జాతి అయినా సరే శృంగారంలో పాల్గొని తీరాల్సిందే. ముఖ్యంగా మనిషి జీవితంలో శృంగారం ఓ భాగం.

ప్రతి వ్యక్తికి శృంగారం ఎంతో ముఖ్యం. అది మానవజాతి అయినా.. జంతు జాతి అయినా సరే శృంగారంలో పాల్గొని తీరాల్సిందే. ముఖ్యంగా మనిషి జీవితంలో శృంగారం ఓ భాగం. అందుకే ప్రతి స్త్రీపురుషుడు సెక్స్ కోసం పరితపిస్తుంటారు. శృంగారానికి చిన్నాపెద్దా.. పేద ధనికుడు అని తేడా లేదు. 
 
కొన్ని సందర్భాల్లో నిద్రపట్టదు. అలాంటి సమయంలో శృంగారంలో పాల్గొంటే శరీరం ఎంతో హాయిగా ఉంటుంది. పైగా మనిషి బాగా అలిసిపోతాడు. మంచి నిద్రపడుతుంది. పడకగదిలో మంచం మీద చేసే ఆ రతిక్రీడ జిమ్‌లో చేసే వ్యాయామం కంటే అధికం. పైగా, ప్రతి రోజూ రతి క్రీడలో పాల్గొనే దంపతులు ఆరోగ్యవంతంగా కూడా ఉంటారని సెక్స్ వైద్య నిపుణులు అభిప్రాయపడుతుంటారు. 
 
ఇదంతా ఒక ఎత్తు అయితే, అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్త మనిషి ఆయుష్షు గురించి ఓ కొత్త విషయాన్ని బయట పెట్టాడు. శృంగారంలో పాల్గొంటే.. మనిషి ఆయుష్షు సాధారణంగానే ఉంటుందట. అదే మనిషి రతిక్రీడలో పాల్గొనకుండా రోజుకు అవసరమైన 1600 కేలరీల ఆహారాన్ని తీసుకుంటే.. మనిషి ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని ఈ పరిశోధనలో వెల్లడైంది. అంటే శృంగారానికి దూరంగా ఉంటే దాదాపు 150 సంవత్సరాల పాటు జీవించవచ్చని ఆయన పరిశోధనలో వెల్లడైంది.