Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్ ఫోన్ల ద్వారా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు.. ఒకే ఫోన్‌ను వాడొద్దు.. 80శాతం అక్కడే?

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (16:08 IST)

Widgets Magazine
mobile phone

ఆస్పత్రులకు వెళ్తున్నారా? ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండాలంటే సెల్ ఫోన్లను తీసుకెళ్లకండి. ఇది కాస్త కష్టమే అనుకుంటున్నారా? అయితే మొబైల్ ఫోన్‌ను ఆస్పత్రుల్లోకి ఎంటర్ అయ్యే ముందు బ్యాగుల్లో పెట్టేయండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ పద్ధతిని ఆస్పత్రిలోనే కాదు.. ఇంట్లోనే అనుసరించాలి. అంతేకాదు.. ఒకే ఫోనును ఎక్కువమంది ఉపయోగించకూడదని వారు సూచిస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే? ఆసుప‌త్రుల్లో ఉన్న‌ పేషెంట్లకు ఏమాత్రం ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండేందుకు సిబ్బంది జాగ్ర‌త్త‌లు తీసుకుంటారనే విషయం తెలిసిందే.
 
అయితే ఆసుప‌త్రుల్లో సెల్‌ఫోన్ల వాడకం వల్ల 81.8 శాతం బ్యాక్టీరియల్ పాథోజెన్‌లు వ్యాప్తి చెందుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ఇక హ్యాండ్ స్వాబ్‌ల వల్ల 80 శాతం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వ్యాపిస్తున్నాయని కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా వెల్లడించింది. ఈ స‌ర్వే అనంత‌రం ఇన్ఫెక్షన్లను అరికట్టడానికి పాటించాల్సిన సూత్రాలను తెలుపుతూ ఐసీఎంఆర్ ప‌లు సూచ‌న‌లు విడుదల చేసి, వాటిని ఐసీఎంఆర్ వెబ్‌సైట్‌లో ఉంచారు. 
 
ఇక ఇందుకు కారణాలు కూడా చెప్పింది. ఒకే మొబైల్ ఫోనును ఎక్కువమంది ఉపయోగించడం ద్వారానే ప్రధానంగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని సర్వేలో వెల్లడైనట్లు పేర్కొంది. ఒక‌ మొబైల్ ఫోన్‌ని ఒకరు వాడినప్పుడు వాళ్ల చేతులకు ఉండే బ్యాక్టీరియా ఫోన్‌కు అంటుకుంటుంది. అలాగే సెల్ ఫోన్ యూజర్లు తమ చేతుల్ని శుభ్రం చేసుకోకుండానే ఫోనును ఉపయోగించడం.. ఆ ఫోనును వేరొకరికి ఇవ్వడం ద్వారా ఇన్ఫెక్షన్లు తప్పవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

స్వైన్ ఫ్లూ లక్షణాలేంటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

స్వైన్ ఫ్లూ మహమ్మారి తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. దగ్గు, జలుబు, జ్వరం, గొంతు ...

news

రాత్రి పడుకునే ముందు పచ్చకర్పూరం గుళిక ఒకటి మింగితే...

కర్పూరాల్లో రకాలున్నాయి. పచ్చకర్పూరం తెల్లకర్పూరంకన్నా చాలామంచిది. ఇది పలుకులుగా దుకాణంలో ...

news

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోండి.. స్లిమ్‌గా మారండి

అలోవెరా జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చునని.. శరీరాకృతిని ...

news

గుండెను బలంగా ఉంచాలంటే..? మల్లెపూల టీని సేవించండి..

గుండెపోటు వచ్చేందుకు ప్రధాన కారణం.. శరీరానికి శ్రమ లేకపోవడమే. బిజీలో కూర్చుని గంటల పాటు ...

Widgets Magazine