బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 11 జనవరి 2017 (19:24 IST)

అల్పాహారంగా నూడుల్స్ వద్దు.. రాత్రి మిగిలిన చికెన్‌ను వేడి చేసి తినొద్దు..

అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. పంచదార, వెన్నతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. బేకరీ ఫుడ్స్‌ను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరుతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంట

అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. పంచదార, వెన్నతో చేసిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు. బేకరీ ఫుడ్స్‌ను తీసుకోవడం ద్వారా శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరుతాయి. వేయించిన బంగాళాదుంపల్నీ అల్పాహారంలో తీసుకుంటే అజీర్తి తప్పదు. తేలికగా జీర్ణమయ్యే పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చిన వారవుతారు. 
 
త్వరగా తయారవుతాయని టిఫిన్‌ కోసం కొందరు నూడుల్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాని ఇవి ఆరోగ్యానికి మంచివి కావు. వీటిల్లో సొడియం అధికం.  కొందరు రాత్రి మిగిలిన చికెన్‌ వంటకాలను మర్నాడు వేడి చేసి తింటారు. ఇలా చేస్తే హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్లు శరీరంలోకి చేరిపోతాయి. 
 
తాజా పండ్ల రసాలను తయారు చేసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. కానీ అప్పటికప్పుడు చేసిన వాటికే ప్రాధాన్యమివ్వాలి. ముందురోజు చేసిన వాటిని మర్నాడు ఉదయం తాగడం వల్ల పొట్టలో బ్యాక్టీరియా చేరుతుంది. పోషకాలు సరిగా అందవు. ఇక ఉదయం పూట గుడ్డు తినడం మంచిదే. అయితే నూనెలో ఫ్రై చేయకుండా ఉడికించిన గుడ్డును తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.