శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2017 (14:13 IST)

వృద్ధాప్యంలో చలాకీగా చిన్న చిన్న పనులు చేయండి.. గుండెపోటును తరిమికొట్టండి..

వయసు మీద పడింది. 60 ఏళ్లు దాటింది. ఇక ఇంటి పని ఏం చేస్తాం... అంటూ అలసిపోతున్న వృద్ధులు మీరైతే ఇక యాక్టివ్‌గా ఉండండి. ఎందుకో తెలుసా? వయస్సు మీద పడిందనే విషయాన్ని మరిచిపోయి.. ఇంటి పనులను మీ శక్తికి తగ్గ

వయసు మీద పడింది. 60 ఏళ్లు దాటింది. ఇక ఇంటి పని ఏం చేస్తాం... అంటూ అలసిపోతున్న వృద్ధులు మీరైతే ఇక యాక్టివ్‌గా ఉండండి. ఎందుకో తెలుసా? వయస్సు మీద పడిందనే విషయాన్ని మరిచిపోయి.. ఇంటి పనులను మీ శక్తికి తగ్గట్టు చేసుకుంటూ పోతే.. గుండెకు బలం చేకూర్చిన వారవుతారని యూనివర్శిటీ ఆఫ్ పీటర్స్ బర్గ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి అయ్యింది. 
 
వృద్ధాప్యంలో చలాకీగా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా ఆయుష్షు మరికొన్నేళ్లు పెంచుకునే వీలుంటుందని పరిశోధకులు చెప్తున్నారు. కొంచెం సేపు అలా బయట నడవడం.. ఇంటిని శుభ్రపరచడం.. చిన్న మొక్కలు పెంచడం.. వాటిని సంరక్షించడం వంటి పనులు చేస్తే.. వృద్ధాప్యంలో ఉన్నారనే విషయాన్నే మరిచిపోతారని పరిశోధకులు సూచిస్తున్నారు. మెట్లెక్కి దిగడం, దుస్తులు ఉతకడం, డ్యాన్స్ చేయడం, నడవడం వంటివి గుండెపోటు నుంచి వృద్ధులను చాలామటుకు కాపాడుతాయని వారు చెప్తున్నారు. 
 
యూనివర్శిటీ ఆఫ్ పీటర్స్ బర్గ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వృద్ధులమైపోయామనే దిగులు ఆవహించడంతో చాలామంది అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని డాక్టర్ డేనియర్ ఫోర్మెన్ తెలిపారు. అయితే యోగా, వాకింగ్, ఇంట్లో చిన్నపాటి పనులు చేసే వృద్ధుల ఆయుష్షు పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు తగ్గాయని.. ముఖ్యంగా హృద్రోగ సమస్యలు వీరిలో అంతగా కనిపించలేదని అధ్యయనంలో వెల్లడైనట్లు ఫోర్మెన్ చెప్పారు.