బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 8 జనవరి 2016 (10:10 IST)

బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే?

ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకుంటే శారీరానికి సరిపడా బి-విటమిన్ లభిస్తుంది. వారానికి కనీసం మూడు గుడ్లు తీసుకున్నట్లయితే జీవితాంతం కంటి చూపు బాగుంటుంది. కోడిగుడ్డు పచ్చసొనలో ఉండే ల్యూటిన్, ఎక్సాన్‌థిన్, కెరోటినాయిస్ నేత్ర రెటీనాను శక్తివంతంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ వారి ప్రకారం ప్రతి ఒక్కరికి రోజూ ఒక మైకోగ్రాం విటమిన్ -బి12 అవసరం. అయితే ఒక కోడి గుడ్డులో 0.25 మైకోగ్రాముల బి12 విటమిన్ ఉంటుంది. ఆ ప్రకారంగా వారానికి ఆరు గుడ్లు కనీసం తీసుకోవాలని అంటున్నారు. 
 
అలాగే, శారీరం కాల్షియంను గ్రహించడానికి గుడ్డు సహాయం చేస్తుంది. అంతేకాకుండా అస్తియో పోరోసిస్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుంది. గుడ్డులో ఉండే థెలినీయం, ఈ - విటమిన్ హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. రోజూ గుడ్డు తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది భయపడుతుంటారు కానీ ఇది నిజం కాదంటున్నారు న్యూట్రిషనిస్టులు. 
 
ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డు తీసుకుంటే అధికంగా ఉన్న బరువును 65శాతం తగ్గిస్తుంది. రోజుకు మూడు చొప్పున వారంలో రెండుసార్లు అలా 12 వారాల పాట్లు గుడ్లు తీసుకున్నట్లయితే అందమైన శరీరాకృతి మీ సొంతమవుతుంది. గుడ్డులో కోలెస్ట్రాల్ ఉన్నప్పటికీ నూనెలో వేయించిన పదార్థాలతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. గుండెపోటు వచ్చే అవకాశం కూడా తక్కువే. కాబట్టి నిరంభ్యంతరంగా మీ డైట్‌లో గుడ్డును తీసుకోండి.