మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2019 (16:51 IST)

ఉల్లికాడలు, పెరుగుతో జలుబు, దగ్గు మటాష్

ఉల్లికాడలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉల్లిపాయలతో పోలిస్తే కాడల్లో సల్ఫర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది అధిక బరువును తగ్గిస్తుంది. రక్తపీడనం అదుపులో ఉంటుంది. పైల్స్ సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉచ్చికాడలని వేసి పచ్చిగా తింటే మంచిది. పైల్స్ వల్ల వచ్చే వాపు, నొప్పి తగ్గుతాయి. జలుబు, దగ్గుతో బాధపడేవారు సూప్స్‌లో ఈ కాడలని సన్నగా తరిగి వేసుకుంటే గుణం కనిపిస్తుంది. 
 
అలాగే పచ్చికాడల రసం తీసుకుని అంతే పరిమాణంలో తేనెతో కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. వీటిల్లోని పెక్టిన్‌ అనే పదార్థం... పెద్దపేగుల్లోని సున్నితమైన పొరలు చెడిపోయి క్యాన్సర్‌ రాకుండా కాపాడుతుంది. 
 
ఉల్లికాడలకు చెడు కొలెస్ట్రాల్‌నూ, కాలేయం చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించే గుణముంది. అంతే కాకుండా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారికి ఇది దివ్యమైన ఔషధం. కెలొరీలు కొవ్వు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఉల్లికాడలని తరచుగా తినేవారిలో అధికబరువు సమస్య తలెత్తదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.