శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : సోమవారం, 1 జనవరి 2018 (15:19 IST)

చలికాలంలో కందుల సూప్ తాగితే..?

శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి. కందిపప్పుతో చేసే వంటకాలను రోజూ తీసుకున్నా.. కందిక

శీతాకాలంలో కందులు (పచ్చిగా వుండే కంది గింజలు) తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరానికి చెక్ పెట్టాలంటే కందులను ఉడికించి తీసుకోవాలి. కందిపప్పుతో చేసే వంటకాలను రోజూ తీసుకున్నా.. కందికాయలను తీసుకొచ్చి ఉడికించి సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకుంటే లేకుంటే సూప్‌లో ఉపయోగిస్తే.. దగ్గు, శ్వాసకోశ సమస్యలు తొలగిపోతాయి. కందులు రుచినే కాకుండా ఎక్కువ పోషకాలను శరీరానికి అందిస్తాయి. పప్పుతో పాటూ సూపుల్లో వేసుకుని తింటే కందుల గింజలు మంచి రుచిగా ఉంటాయి.
 
కందుల్లో మాంసకృత్తులు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా చర్మ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. చెంచా చొప్పున కందుల పొడీ, తేనె కలిపి ముఖానికి రాయాలి. వేళ్లతో ముఖంపై మృదువుగా రుద్దుతూ పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇది పొడి చర్మం ఉన్న వాళ్లకి చక్కగా ఉపయోగపడుతుంది. ముఖానికి చక్కటి రంగునూ తీసుకొస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.