బంగాళాదుంపల్ని తింటే లావెక్కుతారా? (Video)

మంగళవారం, 5 డిశెంబరు 2017 (13:52 IST)

బంగాళా దుంపల్ని తింటే లావెక్కుతారని కొందరి అపోహ. ఇందులో కొంత నిజమున్నా.. మధుమేహం, ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వారు స్వల్పంగానే వీటిని తీసుకోవాల్సి వుంటుంది. కానీ ఎదిగే పిల్లలు మూడు పదులు నాలుగు పదులు దాటిన వారు ఆహారంలో బంగాళాదుంపను తప్పక చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

బంగాళాదుంపల్లో కార్బొహైడ్రేట్స్ పుష్కలంగా వుంటాయి. బంగాళా దుంపలు ఎక్కువ క్యాలరీలను ఒక్కసారిగా అందిస్తాయి కాబట్టి.. మోతాదుకు మించకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. బంగళాదుంపల్లో పీచు పుష్కలంగా వుంటుంది. 
 
అందుకే వీటిలో పైనున్న తొక్క తీయకుండా వండాలని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఎందుకంటే పొట్టులోని పీచు పొట్టను శుభ్రం చేస్తుంది. అజీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. బంగాళాదుంప రక్తపోటును తగ్గిస్తుంది. ఆలూలో విటమిన్‌–సి, బి–కాంప్లెక్స్‌తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, జింక్‌ ఉంటాయి. ఇవన్నీ చర్మకాంతికి తోడ్పడుతాయి. యాంటీ-ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తాయని న్యూట్రీషియన్లు సూచిస్తున్నారు. 
 
పొటాటోలోని బీ6 నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది. విటమిన్ బి6 ఒత్తిడిని దూరం చేస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయులను సక్రమంగా వుంచుతుంది. తద్వారా నరాలకు, మెదడుకు రక్తప్రసరణ క్రమంగా వుంటుంది. ఇందులోని విటమిన్ సి ద్వారా వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫైబర్ ద్వారా హృద్రోగ సమస్యలు నయం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 దీనిపై మరింత చదవండి :  
Potato Health Benefits Ayurveda Video Youtube

Loading comments ...

ఆరోగ్యం

news

చెమటతో వళ్లు తడిసిపోతే దుర్గంధం.... కానీ అది రాస్తే పరిమళం...

చెమట వాసన రాకుండా వుండేందుకు చాలామంది పెర్‌ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇన్ని వాడుతున్నా ...

news

చెన్నై అపోలో చిన్నపిల్లల ఆస్పత్రి సరికొత్త రికార్డు

చెన్నై మహానగరంలో ఉన్న అపోలో గ్రూపునకు చెందిన చిన్న పిల్ల చెన్నై అపోలో ఆస్పత్రి సరికొత్త ...

news

అల్లం రసంతో బరువు తగ్గండి..

పరగడుపునే అల్లం రసం తాగితే రక్త సరఫరా మెరుగు పడుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు ...

news

మార్నింగ్ వాక్ ఎలా చేస్తున్నారు?

మనిషికి శారీరక శ్రమ చాలా అవసరం. అది లేకపోతే రోగాల బారిన పడటం ఖాయం. దైనందిన చర్యల్లో ...