Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జంక్ ఫుడ్‌ను పక్కనబెడితే సౌందర్యం మీ సొంతం

గురువారం, 7 డిశెంబరు 2017 (14:17 IST)

Widgets Magazine

జంక్ ఫుడ్ అలవాటును మానుకుంటే అందంగా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీసుకునే ఆహారాన్ని బట్టే చర్మ సౌందర్యం వుంటుంది. జంక్ ఫుడ్‌ను మానేస్తే చర్మం కాంతివంతం అవుతుంది. కరకరలాడే పొటాటో చిప్స్, నోరూరించే చీస్, బర్గర్లు తీసుకోవడాన్ని పక్కనబెడితే నిండైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
 
జంక్ ఫుడ్ మానేసిన కొద్ది రోజుల్లోనే బరువు తగ్గుతారు. కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గుముఖం పడతాయి. తద్వారా మధుమేహం ఇబ్బంది వుండదు. శరీరంలో కొత్త ఉత్సాహం పుట్టుకొస్తుంది. ప్రోసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్ మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటి ద్వారా చికాకు, కోపం పెరుగుతాయి. శరీరానికి తగినంత పోషకాలు అందితేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. అప్పుడే మానసిక ప్రశాంతత లభిస్తుంది. 
 
ఫ్రెంచ్ ఫ్రైస్, చీస్, బర్గర్లు తింటే గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్, డయాబెటిస్ తప్పదు. జంక్ ఫుడ్‌లోని సోడియం కిడ్నీ సమస్యలకు కారణమవుతుంది. డైట్‌లో జంక్ ఫుడ్ లేకుండా చూసుకుంటే.. ప్రాణాంత రోగాలు దరిచేరవు. జంక్ ఫుడ్స్ స్థానంలో పండ్లు, కూరగాయలు తీసుకోవడం ద్వారా శరీరానికి అత్యవసరమైన ఫైబర్, ప్రోటీన్, క్యాల్షియం, విటమిన్లు అందుతాయి. తద్వారా అనారోగ్య సమస్యలుండవని, వృద్ధాప్య ఛాయలు తగ్గుముఖం పడుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజుకో అరటిపండు తినండి.. లివర్‌ను శుభ్రం చేసుకోండి.

రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు ...

news

రాత్రి భోజనం పది గంటలు దాటితే...

రాత్రి భోజనం పది గంటల్లోపు తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అర్థరాత్రి పూట ...

news

బంగాళాదుంపల్ని తింటే లావెక్కుతారా? (Video)

బంగాళా దుంపల్ని తింటే లావెక్కుతారని కొందరి అపోహ. ఇందులో కొంత నిజమున్నా.. మధుమేహం, ...

news

చెమటతో వళ్లు తడిసిపోతే దుర్గంధం.... కానీ అది రాస్తే పరిమళం...

చెమట వాసన రాకుండా వుండేందుకు చాలామంది పెర్‌ఫ్యూమ్స్ వాడుతుంటారు. ఇన్ని వాడుతున్నా ...

Widgets Magazine