గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (13:41 IST)

మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో వుంచుతున్నారా? వాటిని వేడిచేసి తింటే వీర్యలోపం?

ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటున్నారా? అయితే వీర్యలోపం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఉడికించిన పొటాటో, బీట్‌రూట్‌లను ఫ్రిజ్‌లో వుంచి తిరిగి వేడి చేసి తీస

ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటున్నారా? అయితే వీర్యలోపం తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒక్కసారి ఉడికించిన పొటాటో, బీట్‌రూట్‌లను ఫ్రిజ్‌లో వుంచి తిరిగి వేడి చేసి తీసుకుంటే వీర్యలోపం తప్పదని వారు అంటున్నారు. ఇదే విధంగా ఐరన్, నైట్రేట్లు అధికంగా గల ఆకుకూరలను వండిన తర్వాత ఫ్రిజ్‌లో వుంచకూడదు. ఆకుకూరలను వండిన వెంటనే తినేయాలి. 
 
ఫ్రిజ్‌లో వుంచి తీసుకుంటే మాత్రం క్యాన్సర్ ఏర్పడే ఛాన్సులున్నాయి. ఇదే విధంగా కోడిగుడ్లను ఫ్రిజ్ నుంచి తీశాక మళ్లీ వేడి చేసి తీసుకోకూడదు. కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు వంటి పదార్థాలు ఫ్రిజ్ లోపెట్టొచ్చుకానీ.. వండిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టకపోవడం మంచిది. వండే ఆహారాన్ని మిగిలిపోకుండా చేసుకోవడం ఉత్తమం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉడికించిన ఆహారాన్ని వేడి చేసి తీసుకోవడం ద్వారా పేగులకు దెబ్బేనని తద్వారా అజీర్తి సమస్యలు తప్పవని వారు హెచ్చరిస్తున్నారు.
 
అలాగే పాలు, కోడిగుడ్లు మాంసాన్ని ఫ్రిజ్‌లో వుంచితే వారానికి ఓసారైనా శుభ్రం చేయాలి. అలా చేయని పక్షంలో బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంది. ఆ బ్యాక్టీరియా డయేరియాకి కారణమవుతుంది. ఫ్రిజ్‌లో వుంచిన ఆహార పదార్థాలను పిల్లలకు ఇవ్వకపోవడం చాలా మంచిది. 
 
మాంసాహారాన్ని ఫ్రిజ్‌లో వుంచకపోవడం మంచిది. శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెట్టి, వండిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టి తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే మితంగా తెచ్చుకుని ఆ పూటకు ఆ పూట తినేయడం మంచిదని.. మిగిలించి.. ఫ్రిజ్‌లో పెట్టి తీసుకుంటే ఆరోగ్య ప్రయోజనం వుండదని వారు సూచిస్తున్నారు.