ఆదివారం, 24 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జనవరి 2022 (16:59 IST)

బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్...ఏంటో తెలుసా?

బిర్యానీ ప్రియులకు షాకింగ్ న్యూస్. బిర్యానీ అతిగా తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం కల్తీనే. కొందరు కేటుగాళ్లు ఆహార పదార్థాల తయారీలో అక్రమాలకు పాల్పడి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. ఇటీవల కాలంలో కొన్ని ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, హోటళ్లు, రెస్టారెంట్లు మరీ బరి తెగించాయి. 
 
ఆహారం మంచి రంగులో కనిపించేందుకు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టి వంటల తయారీలో విచ్చలవిడిగా ఎసెన్సులు, ఇతర రంగులను వాడుతున్నారు. హోటళ్లు, సూపర్‌ మార్కెట్లు, బేకరీల్లో ఆహార పదార్థాల కల్తీ నియంత్రణ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడుల్లో విచ్చలవిడి రంగుల వాడకం బయట పడింది. 
 
బిర్యానీ రంగు వచ్చేందుకు విచ్చలవిడిగా సింథటిక్ కలర్స్ వాడేస్తున్నారు. ఇలాంటి కలర్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులు వాడేస్తున్నారని అధికారుల తనిఖీల్లో బయటపడింది.
 
అంతేకాదు హోటల్స్‌లో చికెన్, మటన్, రొయ్యలు ఎక్కువ రోజులు డీప్‌ ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నారు. ఇలాంటి నిల్వ మాసం తింటే అజీర్తి సమస్యలు, ముఖ్యమైన అవయవాలు పనిచేయకపోవటం వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.