శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శనివారం, 3 మార్చి 2018 (18:21 IST)

జలుబు చేసినా యాంటీ బయోటిక్సే... అవి వాడితే ఏం జరుగుతుందంటే..

జలుబనో, గొంతు నొప్పనో పిల్లలకు చిన్న వయస్సు నుంచీ యాంటీ బయోటిక్స్ తరచూ వాడటం వల్ల పొట్టలో అనేక మార్పులు వచ్చి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా వాళ్లు పెద్దయ్యాక రకరకాల అలర్జీలు రావడంతో పాటు ఊబకాయులుగా మారే అవకాశం లేకపోలేదు అంటున్నారు యూనివర్సిటీ ఆ

జలుబనో, గొంతు నొప్పనో పిల్లలకు చిన్న వయస్సు నుంచీ యాంటీ బయోటిక్స్ తరచూ వాడటం వల్ల పొట్టలో అనేక మార్పులు వచ్చి రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఫలితంగా వాళ్లు పెద్దయ్యాక రకరకాల అలర్జీలు రావడంతో పాటు ఊబకాయులుగా మారే అవకాశం లేకపోలేదు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మినెసోటాకు చెందిన పరిశోధకులు. 
 
ఉదాహరణకు అలర్జీల నివారణ కోసం వాడే యాంటీబయోటిక్స్ పొట్టలోని రోగనిరోధక కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి. దాంతోపాటు పొట్టలోని మైక్రోబయోట్స్ చనిపోవడంతో జీవక్రియను ప్రభావితం చేసే ఫ్యాటీ ఆమ్లాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ఫలితమే ఊబకాయం. కాబట్టి ఎంతో అవసరమైతే తప్ప చిన్నప్పటినుంచీ శరీరానికి యాంటీబయోటిక్స్‌ను పెద్దగా అలవాటు చేయకూడదని సంబంధిత పరిశోధకుల సూచన.