శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : బుధవారం, 4 మే 2016 (16:50 IST)

పండ్ల రసం కంటే పండ్లు ఆరగించడమే బెస్ట్...

సన్నని నాజూకు శరీరం కోసం కొన్ని చిట్కాలు...

ప్రతి రోజూ ఎనిమిది గ్లాసుల నీటిని సేవించాలి. టీ, కాఫీ, జ్యూస్‌లలో చక్కెర శాతాన్ని తగ్గించుకోవాలి. మనం తాగే నీరు శరీర బరువును నియంత్రిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ క్రమం తప్పకుండా నీరు సేవిస్తుండాలి.
 
ప్రతి రోజు నడకను అలవాటు చేసుకోవాలి. ఇంటి బయట, షాపింగ్‌కు వెళ్ళాలన్నా నడిచే వెళ్ళాలి. రోజుకు కనీసం 45 నిమిషాలు నడవాలి. దీంతో శరీరంలోని క్యాలరీలు ఖర్చు అతాయి. వీలైనంత ఎక్కువగా సలాడ్‌లు తీసుకోవాలి. అలాగే ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలుండేలా చూసుకోవాలి. సొరకాయ, టమోటాలు ఆహారంగా తీసుకుంటే మంచిదని వైద్యులు అంటున్నారు.
 
ఆకలి వేసినప్పుడే తినాలి. ఆకలి లేనప్పుడు బలవంతంగా తినకూడదు. ఫాస్ట్‌ఫుడ్‌ను తీసుకోవడం మానుకోవాలి. వీలైనంతమేరకు వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పండ్ల రసం తాగాలనిపిస్తే పండ్ల రసంకన్నా పండ్లను తినాలి. పండ్ల రసం తాగేకన్నా పండ్లు ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రకృతి పరంగా లభించే కూరగాయలన్నీ సమయానుసారం ఆహారంలో ఉండేలా చూసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా రాత్రిపూట కేవలం కూరగాయలతో చేసిన సలాడ్, మొలకెత్తిన గింజలనే ఆహారంగా తీసుకుంటే మంచిది.