శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2016 (17:06 IST)

బాగా నిద్రపోండి.. అందంగానే కాదు.. యంగ్‌గా కనిపించండి..!

వయసు పైబడుతోంది. ముఖం ముడతలు పడి రూపు మారిపోతుంది. ఇక ఏమీ చేయలేం అనుకుంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటించండి. తీయటి పదార్థాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. స్వీట్స్‌ తినకుండా ఉండడం వల్ల బరువు తగ్గుతారు. చక్కెర వల్ల చర్మం సాగడం అధికంగా ఉంటుంది. కొలాజిన్‌ దెబ్బతింటుంది. నిత్యం ముఖాన్ని మసాజ్‌ చేసుకుంటే రక్తప్రసరణ బాగా జరుగుతుంది. చర్మంలో కొలాజిన్‌ ఎక్కువ ఉత్పత్తి కావడం వల్ల అది ఆరోగ్యంగా ఉంటుంది.
 
సాధారణంగా ముఖం, మెడ, చేతులు వంటి భాగాల్లో ఏజింగ్‌ తాలూకూ లక్షణాలు బాగా కనిపిస్తాయి. అలాంటి ప్రదేశంలో ఉన్నమృతకణాలను తొలగిస్తే చర్మం కాంతిలీనుతుంది. మనం తింటున్న పదార్థాలను బట్టి కూడా చర్మంలో ఏజింగ్ మార్పులు వస్తుంది. అందుకే విటమిన్‌-సి బాగా తీసుకుంటే చర్మానికి ఎంతో మంచిది. చర్మంలో కొలాజిన్‌ పెరుగుతుంది. టొమాటోలు, కమలాలు, కివి వంటి వాటిల్లో సీ విటమిన్‌ ఉంటుంది.
 
గ్రీన్‌ టీని నిత్యం తాగడం ఎంతో మంచిది. ఎందుకంటే ఇందులో కూడా యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతాయి. నిద్ర బాగా పోతే కూడా చర్మం నిగనిగలాడుతూ మీ అందం రెట్టింపు అవుతుంది. మీరు యంగ్‌గా కనిపిస్తారు.